Share News

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..

ABN , Publish Date - Aug 20 , 2024 | 06:34 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు...

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ తెలివితేటలకు పదునుపెట్టి వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరితో ఛీ కొట్టించుకుంటుంటారు. ఇలాంటి విచిత్రకరమైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ మార్కెట్‌కు వెళ్లిన ఓ యువతి తన లోదుస్తులను బయటికి తీసి, చివరకు ఏం చేసిందో చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్పెయిన్‌లోని (Spain) సూపర్‌మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (social media influencer) అయిన ఓ యువతి.. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. లోపల తనకు కావాల్సిన వస్తువులు తీసుకున్న ఆమె.. చివరగా బ్రెడ్స్ ఉన్న ప్రదేశానికి వెళ్లింది. అక్కడ కాసేపు నిలబడి స్వీట్లు, బ్రెడ్స్‌ని పరిశీలించింది.

Viral Video: స్కూటీలో రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి.. చూస్తుండగానే వాహనంతో పాటూ..


ఈ క్రమంలో ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించి అందరికీ షాక్ ఇచ్చింది. తన లోదస్తులను తీసేసి, అక్కడే ఉన్న ట్రే ఓపెన్ చేసి.. (woman put her underwear in middle of breads) దాన్ని బ్రెడ్స్ మధ్యలో ఉంచింది. ఆ తర్వాత నవ్వుకుంటూ తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. ఈమె ఫోన్ ఏంటీ విచిత్రంగా ఉందే.. వెనుక వైపు తీక్షణంగా చూడగా షాకింగ్ సీన్..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న వారు బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి.. ఇలాంటి పనులు చేయడం సరికాదు’’.. అంటూ కొందరు, ‘‘ఇది చూస్తే బ్రెడ్స్ తీసుకోవాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 06:34 PM