Share News

Viral Video: గుడ్లపై కన్నేసిన బబూన్లు.. తరిమికొట్టాలని చూసిన పక్షులు.. చివరకు చూస్తుండగానే..

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:29 PM

కోతులు, బబూన్లు, లంగూర్లు ఓకే జాతి అయినా వాటి ప్రవర్తన మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది. కోతులు దుకాణాల్లోని పండ్లు, కూరగాయలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే...

Viral Video: గుడ్లపై కన్నేసిన బబూన్లు.. తరిమికొట్టాలని చూసిన పక్షులు.. చివరకు చూస్తుండగానే..

కోతులు, బబూన్లు, లంగూర్లు ఓకే జాతి అయినా వాటి ప్రవర్తన మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది. కోతులు దుకాణాల్లోని పండ్లు, కూరగాయలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడాన్ని చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, బబూన్ల వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని బబూన్లు విచిత్రంగా పక్షుల గుడ్లపై కన్నేశాయి. చివరకు వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వాటిని తరిమికొట్టేందుకు పక్షులు శతవిధాలా ప్రయత్నించాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) క్రుగర్ నేషనల్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఉన్న కొన్ని బబూన్లు.. చివరకు పక్షి గడ్లపై కన్నేస్తాయి. పక్షులు లేకపోవడాన్ని గమనించి వాటి స్థావరాల వద్దకు వెళ్తాయి. చుట్టూ ఏ పక్షీ లేదని నిర్ధారించుకని గుడ్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. అయితే అదే సమయంలో దూరం నుంచి గమనించిన పక్షులు వేగంగా అక్కడికి వస్తాయి.

Viral Video: పిల్ల జీబ్రాను ఎత్తుకెళ్లిన సింహం.. విడిపించుకోవడానికి ఎదురెళ్లిన తల్లి జీబ్రా.. చివరకు..


కోతులపై ఎటాక్ చేసి గుడ్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. మరోవైపు బబూన్లు కూడా గుడ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. చివరకు గుడ్లను ఎత్తుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో ఆగ్రహించిన పక్షులు వాటిని పొడుస్తూ దూరంగా తరిమికొడతాయి. అయినా బబూన్లు మాత్రం బలవంతంగా (baboon stole the birds egg) గుడ్లను ఎత్తుకుని దూరంగా పారిపోతాయి. కాస్త దూరం వెళ్లి ఆగిన ఓ బబూన్ గుడ్లు తింటూ ఉంటుంది. పక్షులు చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో అక్కడే ఉండిపోతాయి.

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..


ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బబూన్లు ఇలాక్కూడా చేస్తాయా’’.. అంటూ కొందరు, ‘‘పక్షులను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Video credits: (Latest Sightings, YouTube)


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 08:39 PM