Share News

Viral Video: అప్పటిదాకా మనిషిలా ఉంటూ.. అంతలోనే రోబోలా ఎలా మారిపోయాడో చూడండి..

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:28 PM

అంతా మనుషులే అయినా కొందరు మిగతా వారికి భిన్నంగా ఉంటారు. మరికొందరు ఎవరూ చేయలేని విన్యాసాలను అవలీలగా చేసేస్తుంటారు. ఇంకొందరిని చూస్తే.. మానవాతీ శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్రమైన వ్యక్తులకు సంబంధించిన వీడియోలు..

Viral Video: అప్పటిదాకా మనిషిలా ఉంటూ.. అంతలోనే రోబోలా ఎలా మారిపోయాడో చూడండి..

అంతా మనుషులే అయినా కొందరు మిగతా వారికి భిన్నంగా ఉంటారు. మరికొందరు ఎవరూ చేయలేని విన్యాసాలను అవలీలగా చేసేస్తుంటారు. ఇంకొందరిని చూస్తే.. మానవాతీ శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విచిత్రమైన వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అప్పటిదాకా మనిషిలా ఉన్న వ్యక్తి.. అంతా చూస్తుండగానే రోబోలా మారిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీడు మనిషా లేక రోబోనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లో (Airport) అందరికీ షాక్ ఇచ్చాడు. ఎక్సలేటర్‌‌లో పైనుంచి కిందకు వస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎక్సలేటర్‌పై నిలబడ్డ అతను.. ఉన్నట్టుండి నడుమును బెండ్ చేసి, కాళ్ల పాదాలను వెనుక్కు తిప్పి నిలబడ్డాడు. దీంతో ఇతన్ని చూసి కింద నిలబడ్డ పోలీస్ కానిస్టేబుల్ అలాగే షాకై చూస్తున్నాడు.

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..


తర్వాత యథావిధిగా నడుచుకుంటూ వెళ్లిన అతను కాస్త దూరం వెళ్లాక.. వాటర్ బాటిల్స్ తీసుకునే సమయంలోనూ పూర్తిగా వెనక్కు వంగి కింద ఉన్న బాటిల్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఇలా వెనక్కు వంగే సమయంలో (man bending his body like robot) అచ్చం రోబోలాగానే ప్రవర్తించాడు. ఆ తర్వాత వెయింటింగ్ హాల్‌లో కూర్చు్న్న అతను.. తన తలను కుర్చీకి వెనక్కు తిప్పి నీళ్లు తాగుతున్నాడు. దీంతో ఇతన్ని చూసి అటూ, ఇటూ వెళ్లూ వారంతా అవాక్కయ్యారు. పక్కన దూరంగా కూర్చున్న యువతులు భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..


అంతటితో ఆగని ఆ వ్యక్తి విమానంలోకి ఎక్కే ముందు కూడా వెనక్కు వంగి తన కాళ్ల పాదాలను వెనక్కు పెట్టి నడుస్తూ వెళ్లాడు. ఫ్లైట్‌లోకి వెళ్లాక తన మిత్రులతో కలిసి తన తలను 360 డిగ్రీల కోణంలో వెనక్కు తిప్పి విన్యాసం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతను మనిషా లేక రోబోనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతడి బాడీలో స్ప్రింగ్‌లు ఉన్నాయా.. ఏంటీ’’.. అంటూ ఇంకొందర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా.. ఇండికేటర్ పాడవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 04:28 PM