Share News

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:20 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ నదిలో బాతు నీటిపై తేలుతూ రయ్యిన దూసుకెళ్తుంటుంది. అలా బాతు నీటిపై హాయిగా ఎంజాయ్ చేస్తుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దూరం నుంచి బాతును గమనించిన ఓ పులి..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

పులులు, సింహాలకు కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువుల చేతిలో కూడా ఓడిపోయి తోక ముడిచి వెళ్తుంటాయి. ఇంకొన్నిసార్లు పక్షులు కూడా వీటికి షాక్ ఇస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లలో తేలియాడుతూ వెళ్తున్న బాతును చూసిన పులి.. దాడి చేద్దామని వెళ్లింది. అయితే చివరకు దాని పవర్ చూసి ఖంగుతింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నదిలో బాతు నీటిపై తేలుతూ రయ్యిన దూసుకెళ్తుంటుంది. అలా బాతు నీటిపై హాయిగా ఎంజాయ్ చేస్తుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దూరం నుంచి బాతును గమనించిన ఓ పులి.. ‘‘ఆహారమే దొరకలేదు.. కనీసం ఈ బాతునైనా భోంచేసి ఆకలి తీర్చుకుందాం’’.. అని అనుకుంటూ నీళ్లలోకి దిగుతుంది. బాతుకు డౌట్ రాకుండా (tiger trying to attack duck) మెల్లగా ఈదుకుంటూ సమీపానికి వస్తుంది.

Viral Video: ఒకే కొమ్మపై డేగ, రాబందు.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..


అయితే పులి తన వెనుకే రావడాన్ని బాతు పసిగట్టేస్తుంది. దగ్గరికి వస్తుందనగా ఉన్నట్టుండి (duck drowned in water) నీటిలో మునుగుతుంది. దీంతో అప్పటిదాకా బాతును గమనిస్తూ వచ్చిన పులి.. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ‘‘అరే.. ఇప్పటిదాకా కళ్లెదుటే ఉన్న బాతు.. అంతలోనే మాయమైందేంటీ.. ఎక్కడికి వెళ్లిందబ్బా’’.. అనుకుంటూ చుట్టూ చూస్తుంది. అయితే నీటిలోకి మునిగిన బాతు.. కాసేపటికి పులి వెనుక కాస్త దూరంలో నీటిపైకి తేలుతుంది.

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..


అయితే ఆ వెంటనే మళ్లీ నీటిలోకి మునుగుతుంది. ఇలా నీటిలోకి మునుగుతూ, తేలుతూ పులితో ఆట ఆడుకుంటుంది. దీంతో అప్పటిదాకా ఆవేశంగా ఉన్న పులి కాస్తా.. నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా కాలం క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెలివిగల వారి ముందు శక్తివంతులు కూడా ఓడిపోతారంటే.. ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘పులితో ఆటాడుకున్న బాతు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బర్గర్ తింటుండగా మహిళకు ఊహించని షాక్.. ఉన్నట్టుండి వెనుక నుంచి..

Updated Date - Aug 17 , 2024 | 05:50 PM