Share News

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 09:45 PM

కొండచిలువల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి వేటను టార్గెట్ చేశాయంటే.. ఇలా మింగేసి, అలా పిండి పిండి చేసేయగలవు. ఎంత పెద్ద జంతువునైనా నిముషాల వ్యవధిలో మింగేయగలవు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ..

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..

కొండచిలువల వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి అవి వేటను టార్గెట్ చేశాయంటే.. ఇలా మింగేసి, అలా పిండి పిండి చేసేయగలవు. ఎంత పెద్ద జంతువునైనా నిముషాల వ్యవధిలో మింగేయగలవు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పామును మింగిన కొండచిలువ వీడియో వైరల్ అవుతోంది. పామును మింగిన కొద్దిసేపటికి సీన్ రివర్స్ అయింది. చివరకు ఏమైందో చూసి నెటిజన్లు అవాక్కవున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలేసిన ఓ పెద్ద కొండచిలువ.. ఏదీ దొరక్కపోవడంతో చివరకు పెద్ద పామును మింగేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. పామును మింగిన కొండచిలువ పరిస్థితి కాసేపటికి వికటిస్తుంది. పామును జీర్ణించుకోవాలని ఎంత ప్రయత్నించినా దాని వల్ల కాదు.

Viral Video: గుర్రం డెక్కల పవర్ మూమూలుగా లేదుగా.. పాపం ఈ ఎలిగేటర్ పరిస్థితి చివరకు..


దీంతో చివరకు పామును యథావిధిగా బయటికి కక్కేయాల్సిన పరిస్థితి వస్తుంది. అతి కష్టం మీద మింగిన పామును కాస్తా (python that has thrown out snake) .. బయటికి పంపిస్తుంది. అయితే చివరకూ చూస్తే ఆశ్చర్యకరంగా పాము బతికే ఉంటుంది. కొండచిలువ నోటి నుంచి బయటికి వచ్చిన పాము, బతుకుజీవుడా.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది.

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాముకు భూమ్మీద నూకలు మిగిలున్నాయ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2024 | 09:45 PM