Share News

Viral Video: గుర్రం డెక్కల పవర్ మూమూలుగా లేదుగా.. పాపం ఈ ఎలిగేటర్ పరిస్థితి చివరకు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 09:13 PM

వేగానికి మారుపేరుగా గుర్రాన్ని సూచిస్తుంటాం. అంత దూరంలో గుర్రం వస్తుందనగా దాని గిట్టల చప్పుడు వినిపిస్తుంటుంది. ఆ చప్పుడు ఎంత లయబద్ధంగా ఉంటుందో.. ఆ గిట్టల పవర్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. గుర్రం తన కాలితో ఒక్కసారి తన్నిందంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో..

Viral Video: గుర్రం డెక్కల పవర్ మూమూలుగా లేదుగా.. పాపం ఈ ఎలిగేటర్ పరిస్థితి చివరకు..

వేగానికి మారుపేరుగా గుర్రాన్ని సూచిస్తుంటాం. అంత దూరంలో గుర్రం వస్తుందనగా దాని గిట్టల చప్పుడు వినిపిస్తుంటుంది. ఆ చప్పుడు ఎంత లయబద్ధంగా ఉంటుందో.. ఆ గిట్టల పవర్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. గుర్రం తన కాలితో ఒక్కసారి తన్నిందంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా, ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గుర్రం తన ముందు కాళ్లతో ఎలిగేటర్‌ను తన్నడంతో చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలిగేటర్ తీవ్రమైన ఆకలితో వేట కోసం వేచి చూస్తుంటుంది. అయితే దానికి ఎలాంటి జంతువూ కనిపించదు. అయినా ఏదో ఒక జంతువు వస్తే నీళ్లలోకి లాగిపడేద్దామని వేచి చూస్తుంటుంది. ఈ క్రమంలో దానికి ఓ గుర్రం కనిపిస్తుంది. దీంతో నీటిలోంచి (Alligator trying to attack a horse) బయటికి వచ్చి గుర్రంపై దాడి చేయాలని చూస్తుంది.

Viral Video: ఇలాంటి చోరీ ఎక్కడైనా చూశారా.. రోడ్డు పక్కన స్కూటీ ఆపి.. సమీపంలోని గేటు వద్దకు వెళ్లి..


అయితే ఎలిగేటర్ తనపై దాడి చేయడంతో గుర్రానికి చిర్రెత్తుకొస్తుంది. తన ముందు కాళ్లను పైకి లేపి (horse kicking an alligator) ఎలిగేటర్‌ను ఒక్క తన్ను తన్నుతుంది. దీంతో ఎలిగేటర్‌కు చుక్కలు కనిపిస్తాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్లీ ఆ గుర్రం పదే పదే గ్యాప్ ఇవ్వకుండా ఎలిగేటర్‌ను తన్నుతూ ఉంటుంది. దెబ్బకు ఎలిగేటర్ మెలికలు తిరుగుతూ విలవిలలాడిపోతుంది. ‘‘ఇంకోసారి నా జోలికి వస్తే తొక్కి చంపేస్తా’’.. అన్నట్లుగా గుర్రం ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గుర్రం గిట్టల పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలిగేటర్‌కు చుక్కలు చూపించిన గుర్రం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: మెట్రో రైలు డోర్లు మూసుకుపోయే సమయంలో.. సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చాడో చూడండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 17 , 2024 | 09:13 PM