Share News

Viral Video: ఈమె విన్యాసం మామూలుగా లేదుగా.. బస్సులో సీటు కోసం చివరకు ఏకంగా..

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:40 PM

బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది సీట్ల కోసం కుస్తీ పట్టడం చూస్తుంటాం. కొందరు మహిళలు సీటు కోసం మగవారితో పోటీ పడుతుంటారు. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు మహిళలు ఏకంగా డ్రైవర్ సీటును కూడా ఆక్రమించడం చూశాం. ఇలాంటి..

Viral Video: ఈమె విన్యాసం మామూలుగా లేదుగా.. బస్సులో సీటు కోసం చివరకు ఏకంగా..

బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది సీట్ల కోసం కుస్తీ పట్టడం చూస్తుంటాం. కొందరు మహిళలు సీటు కోసం మగవారితో పోటీ పడుతుంటారు. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొందరు మహిళలు ఏకంగా డ్రైవర్ సీటును కూడా ఆక్రమించడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులో సీటు కోసం ఓ మహిళ విచిత్ర విన్యాసం చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. బస్సు ఆగగానే చాలా మంది ప్రయాణికులు సీటు కోసం గబాగబా ఎక్కేస్తారు. దీంతో చూస్తుండగానే బస్సు ఫుల్ అయిపోయింది. ఈ క్రమంలో సీటు కోసం చాలా మంది ఒకరిమీద మరొకరు తోసుకుంటూ ఎక్కడం కనిపించింది.

Viral Video: వామ్మో.. వెన్నులో వణుకు పుట్టించే సీన్.. 8 ఏళ్ల బాలిక పైకి దూకిన పెద్ద డేగ.. చివరకు చూస్తే..


ఇంతవరకూ ఒక ఎత్తైతే సీటు కోసం ఓ మహిళ చేసిన సాహసం చూసి అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. తనకు ఎక్కడ సీటు దొరక్కుండా పోతుందో.. అన్న కంగారులో ఓ మహిళ బస్సు వెనుక వైపు నుంచి పైకి ఎక్కింది. కిటికీపై కాలు పెట్టి (woman entered the bus through window) లోపల ఉన్న వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లింది. ఇలా మొత్తానికి ఎలాగోలా ఆమె క్షేమంగా లోపలికి అయితే వెళ్లింది. ఈమె సాహసం చూసి అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: ఛీ ఛీ.. సూపర్ మార్కెట్లో యువతి పాడు పని.. లోదుస్తులను బయటికి తీసి మరీ..


చాలా మంది ఆమె చేష్టలకు సరదాగా నవ్వుకున్నారు. మరికొందరు ఆమెకు జాగ్రత్తలు చెప్పడం కూడా కనిపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమె సాహసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సీటు కోసం పాట్లు అంటే ఇదేనేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 97వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 09:48 PM