Share News

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..

ABN , Publish Date - Aug 25 , 2024 | 09:03 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో రాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు దారి గుండా వెళ్తుండగా.. దానికి ఖడ్గమృగం ఎదురుపడుతుంది. అయితే ఏనుగుకు చూసి పక్కకు పోకుండా ..

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..

అడవికి రాజు సింహమే అయినా ఏనుగుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సింహం కూడా ఏనుగు జోలికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది. వాటితో పెట్టుకుంటే చివరకు దారుణంగా దెబ్బతింటామని తెలుసు కాబట్టే.. చాలా జంతువులు దూరంగా ఉంటాయి. అయినా కొన్నిసార్లు వాటిని అనవసరంగా కెలుకుతూ చివరకు భారీ మూల్యం చెల్లించుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏనుగు పవర్ ఏంటో తెలీక ఓ ఖడ్గమృగం ఎదరెళ్లింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో రాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు దారి గుండా వెళ్తుండగా.. దానికి ఖడ్గమృగం ఎదురుపడుతుంది. అయితే ఏనుగుకు చూసి పక్కకు పోకుండా ఎదురుగా వెళ్లి నిలబడుతుంది. దీంతో ముందు ఏనుగు దాన్ని.. ‘‘పక్కకు వెళ్లిపోతే బతికిపోతావ్.. లేదంటే చచ్చిపోతావ్’’.. అంటూ హెచ్చరించినట్లుగా సిగ్నల్ ఇస్తుంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


అయినా ఖడ్గమృగం వెనక్కు తగ్గకుండా ఏకంగా ఏనుగుపైకే దాడికి దిగుతుంది. దీంతో ఏనుగుకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘పాపం అని హెచ్చరిస్తే... నాపైనే దాడి చేస్తావా.. నీ పని చెబుతా ఉండు’’.. అన్నట్లుగా దాని పైకి దూకుతుంది. తొండంతో ఖడ్గమృగాన్ని (elephant attacked rhinoceros) అదిమిపట్టి తోసుకుంటూ వెళ్తుంది. దీంతో చివరకు ఖడ్గమృగానికి చుక్కలు కనిపిస్తాయి. ‘‘వామ్మో.. బతికుంటే బలిశాకు తినొచ్చు’’.. అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగందుకుంటుంది.

Viral Video: విమానం ఎక్కబోతూ ఇదేం పని.. ఎయిర్‌హోస్టెస్‌ ఎదుటే ఇతడు చేసిన ఘనకార్యం చూస్తే..


ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఖడ్గమృగానికి చుక్కలు చూపించిన ఏనుగు’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పట్టాల మధ్యలో నల్లటి ఆకారం.. రైలు ఆపి దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 09:03 PM