Share News

Viral Video: బాహుబలి రానాను మించిపోయాడుగా.. మీదకు దూసుకొచ్చిన ఎద్దును ఇతడు ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Sep 17 , 2024 | 06:39 PM

ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటాడు. ఇంతలో అతడికి దారి మధ్యలో ఓ ఎద్దు కనిపిస్తుంది. తన వైపు రావడం చూసిన సదరు మందుబాబు.. వెంటనే బాహుబలి సినిమా గుర్తు చేసుకున్నట్లు ఉన్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా..

Viral Video: బాహుబలి రానాను మించిపోయాడుగా.. మీదకు దూసుకొచ్చిన ఎద్దును ఇతడు ఏం చేశాడో చూడండి..

కొందరు మందు కొడితే తమను తాము మర్చిపోతుంటారు. మరికొందరు చిత్రవిచిత్ర విన్యాసాలన్నీ చేసేస్తుంటారు. ఇంకొందరు ఫుల్‌గా తాగి మురుగు నీటిలో పడుకోవడం, వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపడం వంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి ఎద్దుతో పోటీపడ్డాడు. అచ్చం బాహుబలి సినిమాలో రానా చేసినట్లుగా చేయడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటాడు. ఇంతలో అతడికి దారి మధ్యలో ఓ ఎద్దు కనిపిస్తుంది. తన వైపు రావడం చూసిన సదరు మందుబాబు.. వెంటనే బాహుబలి సినిమా గుర్తు చేసుకున్నట్లు ఉన్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా సమీపానికి వచ్చిన ఎద్దు కొమ్ములను పట్టుకున్నాడు.

Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల.. గమనించిన కుక్క.. చివరకు ఏం చేసిందో చూస్తే..


అచ్చం బాహుబలి సినిమాలోగానే ఎద్దు కొమ్ములను పట్టుకుని.. బలవంతంగా అటూ, ఇటూ తిప్పుతాడు. చివరకు బలం మొత్తం ప్రయోగించి, (man who fells bull by its horns) ఎద్దును నేలపై పడుకోబెట్టాడు. ఇలా సినిమా తరహాలో ఎద్దును అవలీలగా కిందపడేశాడు. ఇతడి నిర్వాకం చూసి రోడ్డుపై వెళ్తున్న వారు అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: వామ్మో.. ఇలాంటి బైక్ స్టంట్ ఎక్కడైనా చూశారా.. మొత్తానికి పెద్ద షాకే ఇచ్చాడుగా..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘90 వేస్తే ఇలాగే ఉంటుందే మరి’’.., ‘‘ఆ ఎద్దును సైలెంట్‌గా ఉంది సరిపోయింది.. లేదంటే చుక్కలు చూపించేది’’.., ‘‘ఎప్పుడూ ఒకరి మౌనాన్ని తక్కువగా అంచనా వేయవద్దు’’.., ‘‘బాహుబలి సినిమా చూసి ఇన్‌స్ప్రైర్ అయ్యాడేమో’’.. ‘‘ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 06:39 PM