Share News

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 07:41 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వెయిటింగ్ హాల్లో చాలా మంది విద్యార్థులు విశ్రాంతి తీసుకుంటుంటారు. అక్కడే ఓ బాలుడు కూడా పడుకుని ఫోన్ చూసుకుంటుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ బల్లి పాక్కుంటూ అటుగా వస్తుంది. చివరకు..

Viral Video: బాలుడు ఫోన్‌ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. ఆఖరికి నిద్రపోతున్నా కూడా ఫోన్ పక్కనే ఉండి తీరాల్సిన పరిస్థితి. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు మళ్లీ ఫోన్ పట్టుకుని చూసుకోవడం వ్యసనంగా మారిపోయింది. ఈ క్రమంలో పక్కన ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు పడుకుని ఫోన్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఓ బల్లి అటుగా వచ్చి అతడి పైకి ఎక్కింది. చివరకు ఏం జరిగిందో చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వెయిటింగ్ హాల్లో చాలా మంది విద్యార్థులు విశ్రాంతి తీసుకుంటుంటారు. అక్కడే ఓ బాలుడు (boy) కూడా పడుకుని ఫోన్ చూసుకుంటుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ బల్లి (lizard) పాక్కుంటూ అటుగా వస్తుంది. చివరకు బాలుడి వద్దకు వచ్చి నేరుగా అతడి భుజం పైనుంచి పైకి ఎక్కేస్తుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


అయితే అప్పటికే పూర్తిగా ఫోన్‌లో నిమగ్నమైన బాలుడు.. బల్లిని చూసి ఏమాత్రం చలింతచకుండా.. ఇలా చేతిలోకి తీసుకుని, (boy threw the lizard) అలా దూరంగా విసిరేస్తాడు. బల్లిని విసిరేయడంతో దూరంగా ఉన్న మహిళల కాళ్ల వద్ద పడుతుంది. సడన్‌గా తమ కాళ్ల వద్ద బల్లి పడడం చూసి ఆ మహిళలు ఉలిక్కిపడి పక్కకు జరుగుతారు. అయితే ఏకంగా బల్లి మీదకు ఎక్కినా ఏమాత్రం ఉలిక్కిపడని ఆ బాలుడు.. అదేదో కర్ర పుల్ల తరహాలో తీసి పక్కకు విసిరేయడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..


చుట్టు పక్కల ఏం జరిగినా తనకు సంబంధం లేదు.. అన్నట్లుగా అతను ఫోన్‌లో నిమగ్నమయ్యాడనే విషయం అర్థమవుతోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘బాలుడిని బల్లి భయపెట్టలేదు.. బల్లే బాలుడిని చూసి భయపడింది’’.. అంటూ కొందరు, ‘‘మాక్కూడా ఇలాంటి ప్రశాంతత, ఏకాగ్రత కావాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వినూత్నంగా స్విమ్మింగ్ చేయాలనుకుంటే.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 07:41 PM