Share News

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:47 PM

సోషల్ మీడియాలో కొన్ని నెలల కిందట చోటు చేసుకున్న ఘటనకు సబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ నాగుపాము.. ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదు కానీ..

Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో దాక్కుని ఉండడం, మనుషుల చొక్కాల్లోకి దూరిపోవడం తదితర ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వింత వింత వస్తువులను మింగుతూ ఇబ్బందిపడుతుంటాయి. తాజాగా, ఓ పాము ఇలాగే చేసింది. పాము గొంతు ఉబ్బెత్తుగా ఉండడంతో చూసిన కొందరు.. అందులో ఏముందా అని పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో కొన్ని నెలల కిందట చోటు చేసుకున్న ఘటనకు సబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశా (Odisha) భువనేశ్వర్‌లో (Bhubaneswar) జరిగినట్లుగా తెలుస్తోంది. ఆకలితో ఉన్న ఓ నాగుపాము.. ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదు కానీ.. ఓ దగ్గు సిరప్ బాటిల్ మాత్రం తారసపడింది. అయితే అదేదో ఆహార పదార్థం అనుకుందో ఏమో గానీ.. (cobra swallowed cough syrup bottle) వెంటనే ఆ బాటిల్‌ను నోటిలో కుక్కేసింది.

Viral Video: ఆహా..! ఈమె తెలివికి చేతులెత్తి దండం పెట్టొచ్చు.. రీల్ చేసేందుకు ఫోన్‌ను ఎలా సెట్ చేసిందంటే..


బాటిల్ సైజు పెద్దగా ఉన్నా కూడా ఎలాగోలా బలవంతంగా మింగేందుకు ప్రయత్నించింది. అయితే బాటిల్ గొంతులోకి వెళ్లగానే ఇరుక్కుపోయింది. దీంతో బాటిల్‌ను అటు మింగలేక.. ఇటు బయటికి కక్కలేక విలవిల్లాడిపోయింది. పామును చూసిన స్థానికులు గొంతు ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏముందా అని పరిశీలించారు. అయితే లోపల దగ్గు మందు బాటిల్ ఉండడం చూసి షాక్ అయ్యారు. అయితే దాన్ని బయటికి తీసే సాహసం చేయలేక.. చివరకు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిచారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం పామును పరిశీలించింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


చివరకు ఎలాగోలా పాము మింగిన బాటిల్‌ను నెమ్మదిగా కక్కేలా చేశారు. బాటిల్ మొత్తం బయటికి వచ్చాక..‘‘ హమ్మయ్య.. బతికిపోయాం’’.. అన్నట్లుగా పాము కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పాముకు దగ్గు వచ్చినట్లుంది.. అందుకే మందు తాగేందుకు ప్రయత్నించింది’’.. అంటూ కొందరు, ‘‘పాము ప్రాణాలను కాపాడారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 05:47 PM