Share News

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

ABN , Publish Date - Sep 13 , 2024 | 08:42 PM

కాదేదీ కవితకు అనర్హం.. అన్న సామెత చందంగా ఎండైనా, వానైనా, చలి అయినా.. ఇలా దృశ్యం ఏదైనా రీల్స్‌కు పనికి రానిదంటూ ఏదీ లేదు.. అన్నట్లుగా తయారైంది. యువతులు కూడా యువకులతో పోటీపడి డాన్సులు చేస్తూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. కొందరు మండుటెండలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వీడియోలు చేస్తే.. ఇంకొందరు...

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

కాదేదీ కవితకు అనర్హం.. అన్న సామెత చందంగా ఎండైనా, వానైనా, చలి అయినా.. ఇలా దృశ్యం ఏదైనా రీల్స్‌కు పనికి రానిదంటూ ఏదీ లేదు.. అన్నట్లుగా తయారైంది. యువతులు కూడా యువకులతో పోటీపడి డాన్సులు చేస్తూ రీల్స్ చేయడం సర్వసాధారణమైంది. కొందరు మండుటెండలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వీడియోలు చేస్తే.. ఇంకొందరు వర్షపు నీటిలో డాన్సులు చేస్తూ రీల్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూసింది. ఇలా అడుగు వేయగానే ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) వర్షపు నీటిలో (rain water) అందమైన రీల్ చేయాలని నిర్ణయించుకుంది. అందంగా డాన్సులు వేస్తూ రీల్స్ చేస్తే.. కుప్పలు తెప్పలుగా వ్యూస్, లైకులు వస్తాయని సంబరపడింది. అందుకు తగ్గట్టుగానే ఇంటి పైకి వెళ్లి.. తన స్నేహితురాలిని వీడియో తీయమని చెప్పింది.

Viral Video: దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో.. సమయానికి వచ్చి ఎలా కాపాడాడో చూస్తే..


కెమెరా ఆన్ చేయగానే డాన్సులు వేసుకుంట వర్షపు నీటిలో రెండు మూడు స్టెప్పులు వేసింది. ఇలా అడుగులు వేసిందో లేదో ఆ వెంటనే ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నీరు పాచి పట్టడంతో కాలు వేయగానే (young woman fell down while dancing) ఒక్కసారిగా జారి ధబేల్‌మని కిందపడిపోయింది. తల నేలకు తగలడంతో నొప్పితో విలవిల్లాడిపోయింది. ఈ ఘటనతో వీడియో తీస్తున్న ఆ యువతి స్నేహితురాలు కూడా అవాక్కైంది.

Viral Video: ఇలాంటి సైకిల్ ఎక్కడైనా చూశారా.. కొనేందుకు డబ్బులు లేక.. చివరకు ఎలా తయారు చేశాడో తెలిస్తే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంటి పైకప్పును ఎప్పుడూ శుభ్రం చేయరా’’.. అంటూ కొందరు, ‘‘డాన్స్ వేయడమే కాదు.. నేలపై చూసుకోవడమూ ముఖ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 08:42 PM