Share News

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..

ABN , Publish Date - Sep 13 , 2024 | 07:48 PM

ఏనుగుకు తొండం, మొసలికి దవడలు, పులులు, సింహాలకు పంజా, జిరాఫీలకు కాళ్లల్లో బలం ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రమాదాలు, పరిస్థితులను బట్టి వాటి వాటి బలం బయటపడుతుంది. వేటాడే సమయంలో సింహం జంప్ చేసి ఒక్కసారి పంజా విసిరిందంటే.. ఇక ఎలాంటి జంతువైనా మట్టికరవాల్సిందే. ఇలాంటి..

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..

ఏనుగుకు తొండం, మొసలికి దవడలు, పులులు, సింహాలకు పంజా, జిరాఫీలకు కాళ్లల్లో బలం ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రమాదాలు, పరిస్థితులను బట్టి వాటి వాటి బలం బయటపడుతుంది. వేటాడే సమయంలో సింహం జంప్ చేసి ఒక్కసారి పంజా విసిరిందంటే.. ఇక ఎలాంటి జంతువైనా మట్టికరవాల్సిందే. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం సాగించింది. అయితే చివరకు సింహాలు చూస్తుండగానే అంతెత్తున జంప్ చేసి ఏం చేశాయో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆఫ్రికాలోని (Africa) బోట్స్‌వానాలో ఉన్న చోబ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అడవిలో సింహాల మందకు ఓ పెద్ద జిరాఫీ ఎదురవుతుంది. దానిపై దాడి చేయాలని చూసి సింహాలు.. కాసేపు తటపటాయిస్తాయి. దాని ఎదురుగా పడుకుని ఆలోచిస్తుంటాయి. జిరాఫీ కూడా ఎలాగైనా వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడాలని చూస్తుంటుంది. అయితే చివరకు సింహాలన్నీ (Lion attack on giraffe) కలిసి దాడి చేయాలని ఫిక్స్ అవుతాయి.

Viral Video: రే.. ఏంట్రా.. ఇదీ.. బైకుతో ట్రైన్ లాగాలని చూశాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ముందుగా ఓ సింహం జిరాఫీ వెనుక వైపు వచ్చి ఒక్కసారిగా జిరాఫీ పైకి జంప్ చేసి కింద పడేయాలని చూస్తుంది. అయితే జిరాఫీ దాని ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది. ఈ క్రమంలో చుట్టుముట్టిన సింహాలను తన వెనుక కాళ్లతో బలంగా తన్నే ప్రయత్నం చేస్తుంది. దీంతో సింహాలు కూడా చాలా సేపు దానిపై దాడి చేసేందుకు తటపటాయిస్తుంటాయి. ఇలా ఉండగానే వాటిలో సింహం మళ్లీ జిరాఫీ పైకి అవలీలగా జంప్ చేసి, దాని గొంతు పట్టుకుని కింద పడేయాలని చూస్తుంది. జిరాఫీ ప్రతి ఘటనతో కిందపడిపోతుంది. మళ్లీ మూడో సారి కూడా అలాగే ప్రయత్నించి జిరాఫీ గొంతు పట్టుకుని కిందపడిపోతుంది.

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..


అయితే అప్పటికే పోరాడి, పోరాడి అలసిపోయిన జిరాఫీ.. ఒక్కసారిగా నేలకొరిగి సింహాలకు ఆహారమైపోతుంది. ఈ ఘటనను చూసి అక్కడే వాహనాల్లో ఉన్న పర్యాటకులు తీవ్ర ఉద్వేగానికి లోనవుతారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జిరాఫీ వంటి పెద్ద జంతువుకూ మంద నుంచి విడిపోతే చావే శరణ్యం అని అర్థమవుతోంది’’.. అంటూ కొందరు, ‘‘జిరాఫీని చూస్తుంటే చాలా బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.

Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 07:48 PM