Share News

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

ABN , Publish Date - Sep 12 , 2024 | 09:52 PM

మంచికిపోతే కొన్నిసార్లు చెడు ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మంచికిపోతే కొన్నిసార్లు చెడు ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో వెళ్తున్న వ్యక్తి.. మరో వ్యక్తి రైలు ఎక్కేందుకు సాయం చేశాడు. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైలు బయలుదేరుతుండగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు (train) ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే ఫుట్‌పాత్ వద్ద ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. వారిలో ఓ వ్యక్తి లగేజీ పెట్టుకుని నిలబడి ఉంటాడు. ఫుట్‌పాత్‌పై పరుగెడుతున్న వ్యక్తిని చూసి సాయం చేయాలనే ఉద్దేశంతో రైలు నుంచి కిందకు దిగి ఆ వ్యక్తి రైలు ఎక్కేందుకు సాయం చేస్తాడు.

Viral Video: ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా.. ఈ వ్యక్తి నిర్వాకానికి అవాక్కవుతున్న నెటిజన్లు..


అతన్ని ఎలాగోలా రైలు ఎక్కిస్తాడు గానీ.. చివరకు తాను ఎక్కలేకపోతాడు. తీరా రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. డోరు వద్ద అడ్డుగా ఉంటారు. వారిని తప్పుకొని దారి ఇచ్చేలోగా రైలు ప్లాట్‌ఫామ్ దాటి పోతుంది. దీంతో చివరకు అతడికి సాయం చేసి.. ఇతను మాత్రం రైలు ఎక్కలేకపోతాడు. తర్వాత అతను రైలు ఎక్కాడా, లేక అక్కడే ఉండిపోయాడా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. అలాగే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం కూడా తెలియరాలేదు.

Viral Video: బైక్‌కూ పుట్టిన రోజు.. ఇతడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘మంచికిపోతే చెడు జరగడం అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈరోజుల్లో మంచి చేయాలన్నా భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 09:52 PM