Share News

Viral Video: ఆహా..! ఈమె తెలివికి చేతులెత్తి దండం పెట్టొచ్చు.. రీల్ చేసేందుకు ఫోన్‌ను ఎలా సెట్ చేసిందంటే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 09:40 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) రీల్స్ వీడియోలను వినూత్నంగా తీయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏం చేయాలబ్బా.. అంటూ వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. డాన్స్ చేస్తుండగా.. సినిమా తరహాలో..

Viral Video: ఆహా..! ఈమె తెలివికి చేతులెత్తి దండం పెట్టొచ్చు.. రీల్ చేసేందుకు ఫోన్‌ను ఎలా సెట్ చేసిందంటే..
Woman Dance Trending Reels Videos

ప్రస్తుత సమాజంలో పిల్లల నుంచి వృద్ధుల వరకూ తమ దినచర్యలో రీల్స్ చేయడాన్ని కూడా చేర్చుతున్నారు. కొందరు తమ రోజు వారీ పనులు చేసుకుంటూనే వాటినే రీల్స్ తీస్తూ నెట్టింట ఫేమస్ అవుతుంటే.. మరికొందరు రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. మొత్తంగా అంతా కలిసి వినూత్నమైన రీల్స్ చేసేందుకు తమ మెదడుకు పని పెడుతుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేసేందుకు తన ఫోన్‌ను ఎలా సెట్ చేసిందో చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) రీల్స్ వీడియోలను (Reels) వినూత్నంగా తీయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఏం చేయాలబ్బా.. అంటూ వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. డాన్స్ చేస్తుండగా.. సినిమా తరహాలో కెమెరా చుట్టూ తిరిగేలా ఉంటే ఎలా ఉంటుందీ.. అని అలోచించింది. ఆలోచన వచ్చిందే తడువుగా వెంటనే యాక్షన్‌లో దిగిపోయింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


ఇందుకోసం ఫ్యాన్ రెక్కకు ఓ పొడవాటి రాడ్‌ను అతికించింది. ఆ రాడ్‌కు కింద తన స్మార్ట్ ఫోన్‌ను (Smart phone) తగిలించింది. ఇలా మొత్తం సెట్ చేసుకున్నాక.. ఫ్యాన్ ఆన్ చేసి మంచంపై నిలబడింది. ఆమె డాన్స్ చేస్తుండగా.. ఫ్యాన్ తిరగడం వల్ల ఫోన్ కూడా ఆమె చుట్టూ తిరుగుతూ రికార్డ్ చేసింది. ఫైనల్‌గా వీడియో చూడగా.. సినిమాటిక్ షాట్ తరహాలో వచ్చింది. ఈ వీడియో చూసుకుని ఆమె ఎంతో మురిసిపోయింది.

Viral Video: వరద నీరు ఇంట్లోకి రాకుండా ఇలా చేసిందేంటీ.. కొడుకును ఎలా సెట్ చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు..


ఇలా వినూత్నంగా రీల్ చేసేందుకు ఫ్యాన్‌ను సినిమాల్లో వినియోగించే రౌండ్ ట్రాలీ తరహాలో వాడుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 09:41 PM