Share News

Viral Video: చెరువు గట్టున యువకుల స్నానం.. ముఖానికి సబ్బు రాసుకోగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Sep 13 , 2024 | 09:41 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సినిమాల్లో కనిపించే కామెడీ సీన్లన్నీ.. నిజ జీవితంలో మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. అవన్నీ వీడియోల రూపంలో మన అరచేతిలోకి వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని యాదృచ్ఛికంగా జరిగితే.. మరికొన్ని ప్లాన్ చేసుకుని మరీ క్రియేట్ చేస్తుంటారు. మొత్తానికి ఇలాంటి ..

Viral Video: చెరువు గట్టున యువకుల స్నానం.. ముఖానికి సబ్బు రాసుకోగానే.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సినిమాల్లో కనిపించే కామెడీ సీన్లన్నీ.. నిజ జీవితంలో మన కళ్ల ముందే కనిపిస్తుంటాయి. అవన్నీ వీడియోల రూపంలో మన అరచేతిలోకి వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని యాదృచ్ఛికంగా జరిగితే.. మరికొన్ని ప్లాన్ చేసుకుని మరీ క్రియేట్ చేస్తుంటారు. మొత్తానికి ఇలాంటి వీడియోలన్నీ కలిసి నెటిజన్లకు కావల్సినంత వినోదాన్ని అందిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు చెరువు గట్టున స్నానం చేస్తుంటారు. వారిలో ఓ వ్యక్తి ముఖానికి సబ్బు రాసుకోగానే చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు (youth) చెరువులో స్నానం చేసేందుకు వెళ్తారు. కొద్ది సేపు స్విమ్మింగ్ చేసిన (Bathing in the pond) తర్వాత గట్టుకు వచ్చి సబ్బు రాసుకుంటారు. వారిలో ఓ వ్యక్తి సబ్బును ముఖానికి రాసుకోగానే ఒక్కసారిగా మంట పుడుతుంది. దీంతో కళ్లు మూసుకుని నీటిలో దూకేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కిన మహిళ.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


చెరువు నీటిలోకి దూకాల్సిన యువకుడు.. కళ్ల కనపడకపోవడంతో చెరువు గట్టుకు ఇటు వైపు నేలపై దూకేస్తాడు. చేతులు చాపి నీళ్లలోకి దూకుతున్నాను అనుకుంటూ అచ్చం అలాగే నేలపై దూకేస్తాడు. అయితే తీరా నేలపై పడ్డాక షాక్ అవుతాడు. మళ్లీ పైకి లేచి మరోసారి గట్టిగా అలాగే దూకేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మళ్లీ నేలపైనే పడతాడు. ఇలా కాదు అనుకుని దిశను కాస్త మార్చి మరో వైపు దూకుతాడు. అయితే మళ్లీ నేలపై పడతాడు. ఇతడి నిర్వాకం చూసి పక్కనే ఉన్న అతడి స్నేహితుడు అవాక్కవుతాడు.

Viral Video: దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో.. సమయానికి వచ్చి ఎలా కాపాడాడో చూస్తే..


చివరకు అతడి వద్దకు వచ్చి పట్టుకుని లాగి నీటిలో విసిరేస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే వారు ఇదంతా నవ్వుకోవడానికి కావాలనే చేసినట్లుగా అనిపిస్తుంది. అయినా వీడియో మాత్రం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అచ్చం కప్పలా గెంతుతున్నాడే’’.. అంటూ కొందరు, ‘‘చాలా ఫన్నీగా ఉంది.. గుడ్ యాక్టింగ్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 09:41 PM