Share News

Viral Video: ఈ ఏనుగుకు బాల్యం విలువ బాగా తెలిసినట్టుంది.. చిన్న పిల్లాడికి ఎలా సాయం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jan 19 , 2024 | 09:23 PM

జంతువులు కొన్నిసార్లు మనుషులను అనుకరించడం చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులైతే మనుషులను అనుకరించడమే కాకుండా వారి భావోద్వేగాలను సైతం అర్థం చేసుకుంటుంటాయి. కోతులు, చింపాంజీలు తరచూ...

Viral Video: ఈ ఏనుగుకు బాల్యం విలువ బాగా తెలిసినట్టుంది.. చిన్న పిల్లాడికి ఎలా సాయం చేసిందో చూడండి..

జంతువులు కొన్నిసార్లు మనుషులను అనుకరించడం చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులైతే మనుషులను అనుకరించడమే కాకుండా వారి భావోద్వేగాలను సైతం అర్థం చేసుకుంటుంటాయి. కోతులు, చింపాంజీలు తరచూ ఇలా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు ఏనుగులు కూడా వింత వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆలోచనలో పడేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాల్యం విలువ తెలుసుకున్న ఏనుగు.. చిన్న పిల్లాడికి సాయం చేసిన విధానం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు జూలో వివిధ రకాల జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఏనుగును చూసేందుకు వెళ్తారు. అయితే ఆ సమయంలో ఓ పిల్లాడి చెప్పు జారి ఏనుగు (elephant) ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. దీంతో కిందకు దిగి దాన్ని తీసుకోవడం సాధ్యం కాక పెద్దలతో పాటూ పిల్లాడు కూడా నిరాశగా ఉంటాడు. పిల్లాడి పరిస్థితిని అర్థం చేసుకున్న ఏనుగు వెంటనే స్పందిస్తు్ంది. కింద పడ్డ చెప్పును తన తొండంతో అతి కష్టం మీద పట్టుకుంటుంది.

Viral Video: జింక కోసం ప్రాణాలకు తెగించిన కుక్క.. నది అవతలి ఒడ్డుకు వెళ్లి చివరకు ఏం చేసిందో చూడండి..

తర్వాత చెప్పు జారిపడకుండా కాలి సాయంతో మరింత గట్టిగా పట్టుకుని చిన్నారికి అందించే ప్రయత్నం చేస్తుంది. ‘‘నీ బాధ నేను అర్థం చేసుకోగలను చిన్నా.. ఇదిగో నీ చెప్పు’’.. (elephant gives back sandal to the boy) అన్నట్లుగా ఎంతో ప్రేమతో పిల్లాడికి చెప్పును ఇస్తుంది. దీంతో ఆ బాలుడు కూడా ఏనుగుకు థ్యాంక్స్ చెబుతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు మనసు ఎంత గొప్పదో’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఏనుగుకు బాల్యం విలువ బాగా తెలిసినట్టుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది శాడిస్టు కోతిలా ఉందే.. యువతి విదేశీ ప్రయాణానికే ఎసరుపెట్టింది.. చూస్తుండగానే ఎంత పని చేసిందంటే..

Updated Date - Jan 19 , 2024 | 09:23 PM