Share News

Viral Video: కొడుకును స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. అంతలోనే ఎదురుగా వచ్చిన ఆవు.. చూస్తుండగానే..

ABN , Publish Date - Feb 24 , 2024 | 05:32 PM

ఎవరి జీవితంలో ఎప్పుడు సంతోషం వెళ్లివిరుస్తుందో, ఎప్పుడు విషాద ఘటనలు చోటుచేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న వారు కాస్తా.. ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోతుంటారు. కొన్నిసార్లు...

Viral Video: కొడుకును స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. అంతలోనే ఎదురుగా వచ్చిన ఆవు.. చూస్తుండగానే..

ఎవరి జీవితంలో ఎప్పుడు సంతోషం వెళ్లివిరుస్తుందో, ఎప్పుడు విషాద ఘటనలు చోటుచేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ బాగున్న వారు కాస్తా.. ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోతుంటారు. కొన్నిసార్లు చోటు చేసుకునే ఊహించని ఘటనలు చూస్తే అయ్యో పాపం.! అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ తండ్రి తన కొడుకును స్కూల్‌కు తీసుకెళ్తుండగా.. సడన్‌గా ఓ ఆవు ఎదరురుగా వచ్చింది. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీలోని (Delhi) డియోలీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన సుభాష్ (42) అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌లో ఫైనాన్షియర్‌గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తోంది. ఇదిలావుండగా, సుభాష్ తన కుమారుడిని గురువారం స్కూల్‌కి తీసుకెళ్లాడు. అయితే స్కూల్‌కి సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వ్చిన ఓ ఆవు.. ఉన్నట్టుండి సుభాష్‌పై (cow attacked man) దాడి చేసింది. ఊహించని ఈ ఘటనతో షాకైన అతను.. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా అతన్ని వదలని ఆవు.. పదే పదే కొమ్ములతో పొడిచింది.

Viral Video: కూతురిపై అనుమానం వచ్చి మేడపైకి వెళ్లిన తల్లి.. మొత్తం వెతికి చూడగా.. చివరకు పక్క గదిలో..

పక్కన ఉన్న వారు గమనించి, ఆవును పక్కకు తోలే ప్రయత్నం చేశారు. అయినా ఆవు అతడిపై దాడి చేస్తూనే ఉంది. ఆవును తరిమేయాలని వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆవు తీవ్రంగా దాడి చేయడంతో అతను అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చివరకు ఎలాగోలా అతన్ని పక్కకు లాగి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకుతో కలిసి సంతోషంగా బయటికి వెళ్లిన తండ్రి.. అంతలోనే ఇలా విగతజీవిగా మారడాన్ని స్థానికులు జీర్ణించుకుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral News: మహిళా టీచర్ వింత నిర్వాకం.. విద్యార్థులను ఆలయానికి తీసుకెళ్లి మరీ.. చివరకు..

Updated Date - Feb 24 , 2024 | 05:32 PM