Share News

Viral video: కప్పల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి.. వాటి మధ్యలో పురుగును వదలడంతో చివరకు..

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:37 PM

జంతువుల మధ్య కొన్నిసార్లు మనుషుల తరహాలో తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు బద్ధశత్రువులైన జంతువులు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు మిత్రులుగా ఉన్నవి కాస్త.. శత్రువులుగా మారుతుంటాయి. ఇలాంటి...

Viral video: కప్పల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి.. వాటి మధ్యలో పురుగును వదలడంతో చివరకు..

జంతువుల మధ్య కొన్నిసార్లు మనుషుల తరహాలో తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు బద్ధశత్రువులైన జంతువులు చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తుంటాం. అలాగే మరికొన్నిసార్లు మిత్రులుగా ఉన్నవి కాస్త.. శత్రువులుగా మారుతుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కప్పలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రెండు కప్పల మధ్య చిచ్చు పెట్టాడు. వాటి మధ్యలో పురుగును వదలడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రెండు కప్పలు పక్కన పక్కనే కూర్చుని ఆహారం కోస వేచి చూస్తూ ఉంటాయి. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి.. ఆకలి తీర్చకుండా.. వాటి మధ్య ఏకంగా గొడవ పెట్టేస్తాడు. ఓ పురుగును తీసుకెళ్లి కప్పల మధ్యన వదలుతాడు. దాన్ని చూడగానే ఆకలితో ఉన్న ఓ కప్ప లటుక్కున నోట్లో వేసుకుంటుంది. దీంతో మరింత ఆకలితో ఉన్న ఇంకో కప్పకు చిర్రెత్తుకొస్తుంది. ‘‘నాకూ సగం ఇవ్వకుండా.. నువ్వొక్కదానివే తినేస్తావా’’.. అన్నట్లుగా దానిపై దాడికి దిగుతుంది.

Viral video: బిడ్డ కోసం మొసలితో తలపడిన కోతి.. చివర్లో హృదయం ద్రవించే సీన్..

పురుగును తిన్న కప్పను నోటితో కొరికి తన కసి తీర్చుకుంటుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తు్న్నారు. ‘‘ఈ కప్పలు భలే తమాషాగా ఉన్నాయే’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషుల్లాగే గొడవ పడుతున్నాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..

Updated Date - Mar 21 , 2024 | 08:37 PM