Share News

Viral Video: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులే.. కొండచిలువతో ఏం చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:47 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బాలికలు ఆడుకుంటుండగా.. ఓ పెద్ద కొండచిలువ అటుగా వస్తుంది. దాన్ని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లలు.. అందుకు విరుద్ధంగా దాని సమీపానికి వెళ్తారు. అంతటితో..

Viral Video: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులే.. కొండచిలువతో ఏం చేస్తున్నారో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

పాములు, కొండచిలువలను చూసేందుకే చాలా మంది భయపడుతుంటారు. పొరపాటున అవి దగ్గరికి వస్తే ఇక ప్రాణం పొయినంత పనవుతుంటుంది. అయితే కొందరు మాత్రం వాటితో ఆడుకోవడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొండచిలువతో పిల్లలు చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు బాలికలు ఆడుకుంటుండగా.. ఓ పెద్ద కొండచిలువ అటుగా వస్తుంది. దాన్ని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లలు.. అందుకు విరుద్ధంగా దాని సమీపానికి వెళ్తారు. అంతటితో ఆగకుండా దానిపై కూర్చుని సవారీ కూడా చేస్తారు. ముందు ఒక బాలిక, వెనుక బాలిక కూర్చుంటారు.

Viral Video: గొడుగులు అద్దెకిచ్చే కంపెనీ ఉందని మీకు తెలుసా.. వీడియో వైరల్..


కొండచిలువ (python) ముందుకు కదిలే కొద్దీ వారు కూడా దాంతో పాటూ ముందుకు కదులుతూ రైడ్ చేస్తారు. కొండచిలువపై కూర్చున్నా కూడా వారిలో కొంచెం కూడా భయం కనిపించదు. పైగా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా చాలా సేపు ఆ బాలికలు కొండచిలువ రైడ్ (Ride) చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: కట్టేసి ఉన్న దూడ దగ్గరికి కోబ్రా ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే.. షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పిల్లలకు కొంచెం కూడా భయం లేనట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేసే వారిని హెచ్చరించాల్సింది పోయి.. ఇలా వీడియో తీయడం ఏంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యార్థులు క్లాస్‌ రూమ్‌లో ఉండగా ఊహించని ఘటన.. గోడ పైకి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 01:12 PM