Share News

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:58 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పరోటాలను వినూత్నంగా వడ్డిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా షాక్ అయ్యేలా చేస్తున్నాడు. పరోటాలను చేసిన తర్వాత కస్టమర్లకు వడ్డించే క్రమంలో అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

వంటలు చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు చిత్రవిచిత్ర రెసిపీలతో వంటలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటే.. మరికొందరు మిగతా వారి కంటే భిన్నంగా వంట చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పరోటాలను చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూపిన వారంతా.. ‘‘అవి పరోటాలు అనుకున్నావా లేక మాసిన బట్టలు అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పరోటాలను వినూత్నంగా వడ్డిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా షాక్ ఇస్తున్నాడు. పరోటాలను (paratha) చేసిన తర్వాత కస్టమర్లకు వడ్డించే క్రమంలో అతను చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. పెనంపై వేడి చేసిన పెద్ద పరోటాను పక్కకు తీసిన వ్యక్తి.. బండ మీద వేసి బాదుతాడు.

Optical illusion: మీ చూపు బాగుంటే.. ఈ చిత్రంలో దాక్కున్న ఏలియన్‌ని.. 10 సెకన్లలో పసిగట్టండి చూద్దాం..


చేతులతో పరోటాను అటూ, ఇటూ గట్టిగా కొడుతూ ముద్ద చేస్తాడు. అంతటితో ఆగకుండా బట్టలను ఉతికిన చందంగా పరోటాపై గట్టిగా కొడుతూ చివరకు దాన్ని పీస్‌లు పీస్‌లుగా చేస్తాడు. ఇలా అంత పెద్ద పరోటాను చూస్తుండగానే.. ముద్దగా చేసి పక్కనే ఉన్న పాత్రలో పడేస్తాడు. ఆ తర్వాత దాన్ని కస్టమర్లకు గుడ్డుతో కలిపి ప్లేటులో వడ్డిస్తాడు. ఇతడు పరోటాను వడ్డించే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పరోటా మీద పగతీర్చుకున్నట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘శుభ్రంగా ఉన్న పరోటాను చివరికి కలుషితం చేసేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 04:58 PM