Share News

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Sep 18 , 2024 | 02:55 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కట్ల పాము వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ పెద్ద తేలు కనిపిస్తుంది. అయితే ఏ ఆహారం కనిపించకపోవడంతో ఆ పాము చివరకు తేలునే టార్గెట్ చేస్తుంది. ఎలాగైనా తేలును మింగేసి, ఆకలి తీర్చుకోవాలని ట్రై చేస్తుంది. అనుకున్నట్లుగానే ...

Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మనుషులకు, జంతువులపై పాములు దాడి చేయడం చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు ఎవరూ ఊహించని ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొన్ని పాములు వివిధ రకాల వస్తువులను మింగి ఇబ్బంది పడితే.. మరికొన్ని పాములు తోటి పాములపై దాడి చేయడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పాముకు, తేలుకు మధ్య జరిగిన ఫైట్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కట్ల పాము తేలును మింగాలని చూసింది. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కట్ల పాము వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ పెద్ద తేలు కనిపిస్తుంది. అయితే ఏ ఆహారం కనిపించకపోవడంతో ఆ పాము చివరకు తేలునే టార్గెట్ చేస్తుంది. ఎలాగైనా తేలును మింగేసి, ఆకలి తీర్చుకోవాలని ట్రై చేస్తుంది. అనుకున్నట్లుగానే (snake attacked scorpion) దానిపై ఎటాక్ చేస్తుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహిచని ఘటన చోటు చేసుకుంటుంది.

Viral Video: వామ్మో.. ఈ పులి దొంగలనే మించిపోయిందిగా.. బోనులో పెడితే చివరకు..


తేలుపై దాడి చేసి మింగేయాలని చూస్తుంది. అయితే తల భాగాన్ని మింగగానే తేలును తన ముందు కాళ్లతో పామును గట్టిగా పొడిచేస్తుంది. దీంతో తేలును మింగడం పాముకు సాధ్యం కాదు. మింగేయాలని ఎంత ప్రయత్నించినా తేలు మాత్రం పామును వదలకుండా గట్టిగా పొడిచేస్తుంది. దీంతో నొప్పితో విలవిల్లాడుతున్నా కూడా పాము అలాగే తేలును పట్టుకుని ఉంటుంది. ఇలా చాలా సేపు వాటి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘పాముపై తేలు గెలుస్తుంది’’.. అంటూ మరికొందరు, ‘‘తేలుపై పాము దాడి చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 02:57 PM