Share News

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..

ABN , Publish Date - Sep 17 , 2024 | 08:48 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జనం మధ్యలోకి వెళ్లి ఓ మహిళ వెనుక నిలబడ్డాడు. ఎవరూ తనని గమనించలేదు.. అని..

Viral Video: రద్దీ జనం మధ్యలో మహిళ వెనుక నిలబడ్డ యువకుడు.. ఎవరూ చూడలేదు అనుకుని..

జనం రద్దీగా ఉన్న సమయాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం చూస్తుంటాం. అయితే అంతకంటే ప్రమాదకరమైన మనుషులు కూడా ఉంటారనే విషయం కొన్నిసార్లు కొందరిని చూస్తే తెలుస్తుంటుంది. చాలా మంది శాడిస్టులు.. జనం రద్దీగా ఉన్న సమయాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒక వీడియోను హైదరాబాద్ పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. జనం రద్దీగా ఉన్న సమయంలో ఓ యువకుడు మహిళ వెనుక నిలబడ్డాడు. చివరకు అతడు చేసిన నిర్వాకం చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది. జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు జనం మధ్యలోకి వెళ్లి ఓ మహిళ వెనుక నిలబడ్డాడు. ఎవరూ తనని గమనించలేదు.. అని అనుకుని తన పైశాసికత్వాన్ని బయటపెట్టాడు. ముందు నిలబడ్డ మహిళను తాకరాని చోట (man misbehaved with the woman) తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Viral Video: బిల్డింగ్‌పై పని చేస్తూ.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


జనం రద్దీగా ఉండడంతో పక్కన ఉన్న వారు ఎవరూ అతడి చేష్టలను గమనించలేదు. దీంతో అతను మరింత రెచ్చిపోయాడు. చాలా సేపు అలాగే ప్రవర్తిస్తూ చివరికి ఆమె భుజంపై చేతులు కూడా వేశాడు. అయితే కొందరు ఇతడి వెకిలిచేష్టలను గమనించి, తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియోను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బహిరంగా ప్రదేశాల్లో తప్పుగా ప్రవర్తించే వారు తమ షీ టీమ్ నుంచి తప్పించుకోలేరని, తమ టీమ్ అంతా రికార్డ్ చేస్తుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి చెడు ఉద్దేశాలు పక్కన పెట్టాలని, లేదంటే జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరించారు.

Viral Video: బాహుబలి రానాను మించిపోయాడుగా.. మీదకు దూసుకొచ్చిన ఎద్దును ఇతడు ఏం చేశాడో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నగరంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తప్పు ఇంకోసారి ఎవరూ చేయకుండా కఠిన శిక్షలు విధించాలి’’.. అంటూ మరికొందరు, తమ తమ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలను వివరిస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.8 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. లైకుల కోసం లోయలో చున్నీ ఎగరేస్తూ రన్నింగ్ చేయడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 08:48 PM