Share News

Viral Video: ఈ వీడియో చూస్తే ఆ గణేషుడే దిగివచ్చి క్లాప్స్ కొడతాడేమో..!

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:06 PM

Viral News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి సంబరాలు చేసుకుంటున్నారు జనులు. వినాయక మండపాల వద్ద భక్తులు కోలాహలం చేస్తున్నారు. విజ్ఞేశ్వరుడిని రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Viral Video: ఈ వీడియో చూస్తే ఆ గణేషుడే దిగివచ్చి క్లాప్స్ కొడతాడేమో..!
Group of Girls Dance Perfermance

Viral News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి సంబరాలు చేసుకుంటున్నారు జనులు. వినాయక మండపాల వద్ద భక్తులు కోలాహలం చేస్తున్నారు. విజ్ఞేశ్వరుడిని రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదే సమయంలో భజనలు, కీర్తనలు, డ్యాన్స్‌లు, డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మొత్తం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. రకరకాల వినాయక విగ్రహాలు, పందిళ్లు, భారీ భారీ సెట్లలో వెలిసిన గణపయ్యల ఫోటోలు, వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు నెటిజన్లు షేర్ చేసిన ఓ వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో వినాయకుడికి సంబంధించిన పాటకు కొందరు యువతులు వేసిన డ్యాన్స్.. సూపరో సూపర్ అని అనిపించేలా ఉంది.


డ్యాన్స్ స్కూలో.. మరేమో గానీ.. ఒక పేద్ద హాల్‌లో కొంత మంది యువతులు సమూహంగా నిల్చుని ఉన్నారు. వీరిలో ముందు వరుసలో ఉన్న తొమ్మిది మంది యువతులు ‘గణపతిబప్పా మోరియా’ అంటూ నినదించి.. డ్యాన్స్ ప్రారంభించారు. ఓ బాలీవుడ్ సినిమాలోని ‘దేవా శ్రీ గణేషా’ పాటలోని చివరి లిరిక్స్‌కు వీరంతా డ్యాన్స్ వేశారు. తొలుత తొమ్మిది మంది మాత్రమే డ్యాన్స్ వేయగా.. మధ్యలో మిగతా వారంతా కలిసి డ్యాన్స్ వేశారు. ఆ పాటకు వారి డ్యాన్స్‌ అద్భుతంగా సింక్ అయ్యింది. పాట, డ్యాన్స్ రెండూ చూస్తే గూస్‌బమ్స్ వచ్చేస్తున్నాయి. వీడియోను చూసిన నెటిజన్లు వాట్ ఏ డ్యా్న్స్ ఫర్ఫార్మెన్స్.. శరీరంలో ఒకరకమైన జలదరింపు వస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. వీరి డ్యాన్స్ చూస్తే ఆ గణపతే దిగివచ్చి క్లాప్స్ కొడతాడేమో అని పేర్కొంటున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.


వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..


Also Read:

ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి.. వీడియో వైరల్

హోం మంత్రిని భయపెట్టిన జమ్మూకశ్మీర్ పర్యటన

సకలజనుల రిపోర్ట్ ఎక్కడ కేసీఆర్..?

For More Trending News and Telugu News..

Updated Date - Sep 10 , 2024 | 04:06 PM