Share News

Viral: ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:23 PM

కొందరు చోరీలు జరక్కుండా ఉండేందుకు చాలా మంది అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. అయితే కొందరు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విచిత్ర ప్రయోగాలు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నింటిని..

Viral: ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు.. వీళ్లు తీసుకున్న జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..

కొందరు చోరీలు జరక్కుండా ఉండేందుకు చాలా మంది అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. అయితే కొందరు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విచిత్ర ప్రయోగాలు చేస్తూ, ఆ వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నింటిని చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన బీరువాకు వేసిన తాళం చూసి అంతా అవాక్కతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఈ బీరువాను చోరీ చేయడం అంత ఈజీ కాదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. చోరీలు (thefts) జరక్కుండా ఓ వ్యక్తి తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి ప్రయోగాలు చేయడం చూశాం. వాహనాలు చోరీ కాకుండా వాటిపై ముళ్ల కంచె వేయడం, చెప్పులు చోరీ కాకుండా ఒక్కోటి ఒక్కోచోట వదలడం వంటి విచిత్ర ప్రయోగాలు చేయడం చూశాం.

Viral Video: ఇదేం మిక్సింగ్‌రా బాబోయ్.. పాన్ మసాలాతో ఇతను చేసిన డ్రింక్ చూడండి..


తాజాగా, ఓ వ్యక్తి తన బీరువా చోరీకి (Lock to Beeruva) గురి కాకుండా వింత జాగ్రత్తలు తీసుకున్నాడు. బీరువాకు అందిరిలా తాళం వేయకుండా వినూత్నంగా లాక్ చేశాడు. బీరువాకు సంబంధించిన ఒక డోర్ హ్యాండిల్‌కు కత్తెరను ఉంచి.. మరో డోరు హ్యాండిల్‌ను, కత్తెర (scissor) చివర్లను కలుపుతూ తాళం వేసేశాడు. ఇలా బీరువాకు విచిత్ర పద్ధతిలో తాళం చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడన్నమాట.

Viral Video: సింగల్‌గా వెళ్లిన సింహం.. అడవి దున్నలను చుట్టుముట్టి మరీ.. చివరకు..


ఇతడి విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి అద్భుతమైన టెక్నిక్‌ను ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘మార్కెట్‌లోకి వచ్చిన కొత్త తాళం సూపర్‌గా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 03 , 2024 | 04:23 PM