Viral Video: సింగల్‌గా వెళ్లిన సింహం.. అడవి దున్నలను చుట్టుముట్టి మరీ.. చివరకు..
ABN , Publish Date - Dec 01 , 2024 | 01:37 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం జంతువులు కనిపించే దాడి చేయాలని చూస్తుంటుంది. ఇంతలో దానికి అడవి బీస్ట్ల మంద కనిపిస్తుంది. వాటిని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా..
అడవి జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. వీటిలో పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్నిసార్లు సింహాల వేట చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటుంది. అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువుల చేతలో ఓడిపోయే సింహాలు.. మందలపై సింగిల్‌గా దూకి తమ ప్రతాపాన్ని చూపిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం సింగల్‌గా అడవి దున్నలపైకి దాడికి దిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం జంతువులు కనిపించే దాడి చేయాలని చూస్తుంటుంది. ఇంతలో దానికి అడవి బీస్ట్ల మంద కనిపిస్తుంది. వాటిని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా (Lion attack on wildebeest) వెంటనే దాడికి దిగుతుంది. మంద పైకి ఒక్కసారిగా ఎగిరి దూకుతుంది.
Women: డిజిటల్ అరెస్ట్ పేరుతో లక్షల మోసం.. వీడియో కాల్లో బట్టలు విప్పమంటూ..
సింహం సడన్‌గా ఎటాక్ చేయడంతో దున్నలన్నీ చెల్లాచెదురుగా పారిపోతాయి. అయినా సింహం వాటికి ఎదురుగా వెళ్లి చివరకు వాటిలో ఓ దున్నను టార్గెట్ చేస్తుంది. చివరకు దానిపై దాడి చేసి మెడ పట్టుకుంటుంది. సింహం నుంచి తప్పించుకునేందుకు ఆ దున్న శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా సింహం మాత్రం దాన్ని వదలకుండా గట్టిగా మెడ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్తుంది. ఇలా చివరకు దాన్ని చంపేసి తన ఆకలి తీర్చుకుంటుంది.
ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం సింగల్‌గా వెళ్లడమంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. సింహం పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..