Share News

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..

ABN , Publish Date - Nov 30 , 2024 | 07:30 AM

వివాహాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలు కూడా కొన్నిసార్లు వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు వధువును వరుడు ఆట పట్టిస్తే.. మరికొన్నిసార్లు వరుడికి వధువు వింత వింత షాక్‌లు ఇస్తుంటుంది. ఇలాంటి ..

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..

వివాహాల్లో చోటు చేసుకునే చిన్న చిన్న సంఘటనలు కూడా కొన్నిసార్లు వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు వధువును వరుడు ఆట పట్టిస్తే.. మరికొన్నిసార్లు వరుడికి వధువు వింత వింత షాక్‌లు ఇస్తుంటుంది. ఇలాంటి విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వేదిక పైకి స్వాగతం పలికిన వరుడికి.. వధువు ఊహించని ఝలక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరుల (bride and groom) మధ్య వింత ఘటన చోటు చేసుకుంటుంది. వివాహ వేదికపై ఉన్న వరుడు.. వధువు కోసం ఎదురు చూస్తుంటాడు. కాసేపటికి వధువు అక్కడికి చేరుకుంటుంది. వధువు వేదిక వద్దకు రావడం చూసిన వరుడు.. ఆమెకు స్వాగతం (bridegroom welcomed by the bride) పలికేందుకు వేదిక చివరకు వెళ్లి నిలబడతాడు.

Viral Video: ఈ రూపాయిని ఎత్తుకెళ్లడం ఎవరి తరమూ కాదేమో.. ఇతను ఏం చేశాడో చూస్తే..


వధువు వేదిక పైకి ఎక్కే సమయంలో చేయి అందించి పైకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడి చేయి పట్టుకున్న వధువు.. ఒక్కసారిగా అతన్ని గట్టిగా కిందకు లాగేసింది. వధువు ఒక్కసారిగా కిందకు లాగేడంతో (bride pulled down the groom) కిందపడబోయిన వరుడు.. ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుని కిందకు దూకేస్తాడు. ఇలా వధువు చేసిన పనికి వరుడితో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. కొందరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు.

Viral Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూస్తే.. చివరకు..


మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కాబాయే భర్తకు అందరి ముదు భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి తర్వాత వరుడి పరిస్థితి ఎలా ఉంటుందో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 830కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి నిర్మాణం ఎక్కడైనా చూశారా.. ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 30 , 2024 | 07:30 AM