Viral Video: సినిమా షూటింగ్ అనుకుంటే పొరబడ్డట్లే.. బైకు ప్రమాదం చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:52 AM
సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యం కారణంగా తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాంలోకి నెట్టేస్తుంటారు. మరికొందరు తప్పని తెలిసినా రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి ..
సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యం కారణంగా తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదాంలోకి నెట్టేస్తుంటారు. మరికొందరు తప్పని తెలిసినా రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బైకుపై వెళ్తూ మధ్యలో ఫుట్‌పాత్ పైకి ఎక్కించాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై వెళ్లూ మార్గ మధ్యలో వాహనాన్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తాడు. అంత వరకూ సక్రమంగా డ్రైవ్ చేసిన ఆ వ్యక్తి.. ఉన్నట్టుండి బైకునుర రోడ్డు మధ్యలోకి పోనిస్తాడు. చివరకు రోడ్డు మధ్యలో (bike hit the divider) ఉన్న డివైడర్ పైకి ఎక్కిస్తాడు.
అప్పటికే వేగంగా వస్తున్న బైకు డివైడర్ పైకి ఎక్కగానే ఒక్కసారిగా గాల్లోకి లేస్తుంది. నేరుగా ఎదురుగా ( biker hit the van) వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొడుతుంది. దీంతో బైకుపై ఉన్న వ్యక్తి వ్యాన్ ముందు అద్దాలకు తగులుకుని కిందపడతాడు. అయితే ఆ వెంటనే పైకి తన బైకు వద్దకు నడుస్తూ వస్తాడు. వ్యాన్ డ్రైవర్ సడన్‌గా బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ బైకర్ ఎంతో అదృష్టవంతుడు.. లేదంటే ప్రాణాలో పోయేవి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..