Share News

Viral Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూస్తే.. చివరకు..

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:56 PM

కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే చివరికి ఇంకేదో అవుతుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు అప్పటిదాకా పడిన కష్టం మొత్తం ఊహించని ఘటనల కారణంగా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూస్తే.. చివరకు..

కొన్నిసార్లు ఏదో చేయాలని చూస్తే చివరికి ఇంకేదో అవుతుంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు అప్పటిదాకా పడిన కష్టం మొత్తం ఊహించని ఘటనల కారణంగా బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కాళ్లకు తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూశాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘బ్యాడ్ టైం అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు దాటి తన కారు వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అయితే వర్షం కారణంగా రోడ్డుపై వరద నీరు మొత్తం నిలిచిపోయి ఉంటుంది. నీళల్లో అడుగుపెట్టడం ఇష్టం లేని అతను.. ఎలాగైనా కాళ్లకు తేమ తగలకుండా రోడ్డు దాటాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం చివరకు ఓ పాలిథిన బ్యాగ్ తీసుకుని, అందులో కాళ్లు పెట్టి నిల్చుంటాడు.

Viral Video: ఈ రూపాయిని ఎత్తుకెళ్లడం ఎవరి తరమూ కాదేమో.. ఇతను ఏం చేశాడో చూస్తే..


తర్వాత చేతులతో కవర్ పట్టుకుని గెంతుతూ అతి కష్టం మీద కారు వద్దకు చేరుకుంటాడు. అనుకున్నట్లుగానే కాళ్లకు తేమ తగలకుండా కారు వద్దకు చేరుకుంటాడు. కారు డోరు తీసి, సీట్లో కూర్చుని కవర్‌ను కింద పడేయాలని చూస్తాడు. అయితే ఇంతలో ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ కారు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లడంతో వరద నీరు మొత్తం కారులో కూర్చున్న వ్యక్తిపై పడుతుంది. దీంతో అప్పటిదాకా అతను పడ్డ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.

Viral Video: సినిమా షూటింగ్ అనుకుంటే పొరబడ్డట్లే.. బైకు ప్రమాదం చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కష్టమంతా వృథా అవడం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఎంత తప్పించుకోవాలని చూసినా.. విధి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 2.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి నిర్మాణం ఎక్కడైనా చూశారా.. ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 29 , 2024 | 01:57 PM