Share News

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే.. రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - May 31 , 2024 | 03:57 PM

పక్షులు, జంతువులు తదితరాల నుంచి తమ పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు వివిధ రకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కొందరైతే చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో..

Viral Video: ఈ పొలంలోకి వెళ్లాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే.. రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా..

పక్షులు, జంతువులు తదితరాల నుంచి తమ పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు వివిధ రకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కొందరైతే చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు మనుషుల రూపంలో దిష్టిబొమ్మలు ఏర్పాటు చేస్తే.. మరికొందరు క్రూర జంతువుల బొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తమ పొలాన్ని ఎవరూ నాశనం చేయకుండా ఉండేందుకు ఓ రైతు చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు తన పొలంలోకి పక్షులు, జంతువులు రాకుండా ఉండేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఆఖరికి మనుషులు కూడా భయపడేలా దెయ్యం (devil) రూపంలో ఉన్న మహిళ బొమ్మను తయారు చేశాడు. ఆ తర్వాత ఆ బొమ్మ కదిలే విధంగా ఉండేందుకు నేలలో ఓ కర్ర పాతి, దానికి ఓ స్ప్రింగ్ ఏర్పాటు చేశాడు. దానికి పైన చివరలో సైకిల్ హ్యాండిట్ ఏర్పాటు చేశాడు. దయ్యం ఆ హ్యాండిల్ పట్టుకుని ముందుకు, వెనక్కూ ఊగుతూ ఆడుకుంటున్నట్లుగా క్రియేట్ చేశాడు.

Viral Video: డ్రోన్‌ను ఇలా వాడటం ఎప్పుడైనా చూశారా.. ఇతనేంటీ మరీ వెరైటీగా ఉన్నట్టున్నాడు..


గాలికి బొమ్మ కదలడం, స్ప్రింగ్ కారణంగా చూసేందుకు ఈ దెయ్యం నేలపై నుంచి గాల్లోకి లేస్తున్నట్లుగా ఉంది. రాత్రి వేళల్లో ఈ దిష్టిబొమ్మను (innovative scarecrow) చూస్తే మనుషులు కూడా భయంతో పారిపోయేలా ఉంది. ఈ వినూత్నమైన దిష్టిబొమ్మను సదరు రైతు తన పొలంలో ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ రైతు తెలివితేటలు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇదెక్కడి దిష్టిబొమ్మరా నాయనా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 31 , 2024 | 03:57 PM