Share News

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - May 30 , 2024 | 08:23 PM

కొందరు తెలివిగా ఆలోచిస్తే.. ఇంకొందరు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. అలాగే ఇంకొందరు అతి తెలివితో పాటూ వినూత్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు చేసే చిత్రవిచిత్ర ప్రయోగాలు చూసినప్పుడు..

Viral Video: కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో.. ఈమె రివర్స్ టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

కొందరు తెలివిగా ఆలోచిస్తే.. ఇంకొందరు అతి తెలివిగా ఆలోచిస్తుంటారు. అలాగే ఇంకొందరు అతి తెలివితో పాటూ వినూత్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరు చేసే చిత్రవిచిత్ర ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. ఈ తరహా ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంద. ఓ మహిళ కారు రివర్స్ ట్రిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కారు కంపెనీలు కూడా ఇలా ఆలోచించి ఉండవేమో‘‘.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది వాహనాలను రివర్స్ చేసే సమయంలో గోడలు, వెనక ఉన్న వాహనాలకు తగిలించడం చూస్తుంటాం. అయితే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఓ మహిళ విచిత్రంగా ఆలోచించింది. ఇందుకోసం ఆమె.. తన కారు వెనుక ఓ వాటర్ బాటిల్ ఏర్పాటు చేసింది. అలాగే కారు ముందు వైపు డోరుకు ఓ గ్లాసు కూడా ఏర్పాటు చేసింది. ఈ రెండింటికీ ఓ పైపును కనెక్ట్ చేసింది.

Viral Video: ఆకలితో ఉందని మహిళ ఆహారం తినిపిస్తే.. చివరకు ఈ నక్క చేసిన నిర్వాకం..


చివరగా కారు వెనుక ఉన్న (Water bottle) బాటిల్‌లో నీళ్లు పోసి, తన ప్రయోగం ఎలా పని చేస్తోందో టెస్ట్ చేసింది. కారును రివర్స్ చేస్తూ (Reverse the car) గోడకు ఆనుకుని వెళ్లింది. కారు గోడకు తాకగానే ముందుగా బాటిల్ ఒత్తిడికి గురై.. అందులోని నీరంతా పైపు గుండా ముందు వైపు ఉన్న గ్లాసులోకి చేరాయి. డ్రైవర్ సీట్లో ఉన్న మహిళ.. గ్లాసులోకి నీళ్లు రావడం చూసి కారుకు బ్రేకులు వేస్తుంది. ఈ విధంగా ప్రమాదం జరగకుండా అప్రమత్తమవుతుంది.

Viral Video: రీల్స్ కోసం సిలిండర్‌పై యువతి డాన్స్.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటో మీరే చూడండి..


ఈమె టెక్నిక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె అతి తెలివి అదిరిపోయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నిక్ చూస్తే కారు కంపెనీలు కూడా అవాక్కవుతాయేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వధువు దండ వేస్తుండగా వరుడికి ఊహించని షాక్.. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్న నెటిజన్లు..

Updated Date - May 30 , 2024 | 08:23 PM