Share News

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..

ABN , Publish Date - May 29 , 2024 | 04:43 PM

కొన్నిసార్లు కొందరు చావు అంచుల దాకా వెళ్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. మరికొన్నిసార్లు ఆపద సమయాల్లో కొందరు సమయానికి దేవుడిలా వచ్చి ప్రాణం పోస్తుంటారు. ఇలాంటి..

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న బాలుడు.. చనిపోయాడనుకున్న దశలో ఎలా బ్రతికించారో చూడండి..

కొన్నిసార్లు కొందరు చావు అంచుల దాకా వెళ్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. మరికొన్నిసార్లు ఆపద సమయాల్లో కొందరు సమయానికి దేవుడిలా వచ్చి ప్రాణం పోస్తుంటారు. ఇలాంటి మిరాకిల్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని చూసి అంతా చనిపోయాడని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో బాలుడిని ఓ వ్యక్తి బతికించిన తీరు చూసి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu and Kashmir) శ్రీనగర్‌లోని సఫాకడల్ ప్రాంతంలోని జీలం నదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోతుంటాడు. ఈ క్రమంలో చివరకు పిల్లాడు అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. బాలుడు కొట్టుకుపోవడాన్ని చూసిన ఓ వ్యక్తి నదిలోకి దూకి పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నిస్తాడు. వేగంగా కొట్టుకుపోతున్న బాలుడి వద్దకు అంతే వేగంగా ఈత కొడుతూ వెళ్లి చివరకు సమీపానికి చేరుకుంటాడు. బాలుడిని పట్టుకుని ఒడ్డుకు చేరుస్తాడు. అయితే అప్పటికే పిల్లాడు చలనం లేకుండా పడి ఉంటాడు. తర్వాత ఆ వ్యక్తి పిల్లాడిని బోర్లా పడుకోబెట్టి పీసీఆర్ (PCR) చేస్తాడు. మధ్య మధ్యలో బాలుడి నోటిలో నోరు పెట్టి గాలి ఊదుతాడు.

Viral Video: పిల్లాడిని ఎత్తుకెళ్లాలని ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. తీరా దగ్గరికి రాగానే షాకింగ్ ట్విస్ట్..


ఇలా చాలా సార్లు చేసేసరికి చివరికి బాలుడిలో చలనం వస్తుంది. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న బాలుడు.. మింగిన నీటిని మొత్తం బయటికి కక్కేస్తాడు. బాలుడిలో చలనం రావడంతో పక్కన ఉన్న వారంతా సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత వారు బాలుడిని తమ చేతులపై పడుకోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్తారు. సదరు వ్యక్తి సరైన సమయానికి స్పందించడంతో పిల్లాడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘బాలుడి పాలిట దేవుడిలా వచ్చాడు’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి ఇతను రాకుండా ఉండుంటే.. ఎంత ఘోరం జరిగేదో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆగలేకపోయిన వరుడు.. వధువు పక్కన ఉండగానే.. స్టేజీ కిందకు దూకేసి మరీ..

Updated Date - May 29 , 2024 | 06:59 PM