Share News

Viral Video: పిల్లాడిని ఎత్తుకెళ్లాలని ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. తీరా దగ్గరికి రాగానే షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - May 28 , 2024 | 09:55 PM

సోషల్ మీడియాలో జంతువులు, పక్షుల దాడులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ప్రమాదకర దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న జంతువులు, మనుషుల వీడియోలు కూడా చక్కర్లు కొడుతుంటాయి. అయితే..

Viral Video: పిల్లాడిని ఎత్తుకెళ్లాలని ఆకాశం నుంచి దూసుకొచ్చిన డేగ.. తీరా దగ్గరికి రాగానే షాకింగ్ ట్విస్ట్..

సోషల్ మీడియాలో జంతువులు, పక్షుల దాడులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే ప్రమాదకర దాడుల నుంచి తృటిలో తప్పించుకున్న జంతువులు, మనుషుల వీడియోలు కూడా చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా, ఓ డేగ వేటకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నేలపై ఉన్న చిన్నారిని టార్గెట్ చేసిన డేగ.. ఆకాశం నుంచి దూసుకొచ్చింది. అయితే, తీరా దాడి చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాలుడు పార్క్‌లోని నీటి కొలను పక్కనే నిలబడి ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న డేగ.. వేట కోసం తీక్షణంగా గమనిస్తుంటుంది. ఎంత వెతికినా దానికి ఎలాంటి ఆహారం కనిపించలేదో ఏమో గానీ.. చివరకు కొలను పక్కన నిలబడి ఉన్న బాలుడిని టార్గెట్ చేస్తుంది. దీంతో వెంటనే ఆకాశం నుంచి అత్యంత వేగంగా కిందకు దూసుకొస్తుంది. సరిగ్గా చిన్నారి ఉన్న ప్రదేశానికి క్షణాల్లో చేరుకుని, అతడిపై వెనుక నుంచి (eagle attacked the boy) దాడి చేసేందుకు వేగంగా వస్తుంది.

Viral Video: మేడపై మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన పులి.. చివరకు జరిగిందేంటంటే..


తీరా బాలుడి దగ్గరికి రాగానే.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి చిన్నారిని ఎత్తుకుని పక్కకు పారిపోతాడు. దీంతో డేగ మళ్లీ అంతే వేగంతో ఆకాశంలోకి దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉన్నా.. బాలుడిని డేగ గాయపరచి ఉండేది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ డేగ చాలా డేంజర్‌లా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘సరైన సమయానికి చిన్నారిని భలే కాపాడాడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: పెళ్లయినా భర్తను దగ్గరకు రానివ్వని భార్య.. 12 రోజుల తర్వాత విచారించగా.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Updated Date - May 28 , 2024 | 09:55 PM