Viral Video: ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా డ్రైవింగ్ చేస్తారా..
ABN , Publish Date - May 28 , 2024 | 09:50 PM
చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తే.. మరికొందరు వాహనాలను అడ్డదిడ్డంగా నడుపుతూ ఎదుటి వారిని ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి..
చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు సిగ్నల్ జంపింగ్ చేస్తే.. మరికొందరు వాహనాలను అడ్డదిడ్డంగా నడుపుతూ ఎదుటి వారిని ప్రమాదంలో పడేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకనేందుకు తన వాహనం నడిపిన తీరు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఎంత ట్రాఫిక్ ఉంటే మాత్రం.. ఇలా ఎవరైనా డ్రైవింగ్ చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని (Tamil Nadu) తిరుచ్చిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూటర్‌పై రోడ్డు మీదకు వచ్చిన యువకుడు.. అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించాడు. రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఎలాగైనా త్వరగా వెళ్లాలని అనుకున్నాడో ఏమో గానీ.. తన స్కూటర్‌ను ఏకంగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కించేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్లినట్లుగానే (man riding scooter on divider) డివైడర్‌పై ఎంతో వేగంగా నడిపాడు. చాలా దూరం ఇలాగే డివైడర్‌పై వెళ్తూనే ఉన్నాడు.
ఈ సమయంలో ఏమాత్రం అదుపు తప్పినా రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇతను మాత్రం తన వాహనాన్ని ఎంతో చాకచక్యంగా నడపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్కూటర్‌ను ఇలాక్కూడా నడపొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.