Share News

Viral: జిరాఫీ మెడను సెట్ చేసిన డాక్టర్! ఇలాంటి చికిత్స మీరెక్కడా చూసుండరు!

ABN , Publish Date - May 09 , 2024 | 09:03 PM

మెడ ఎముకలు పట్టేసి తిండి తినలేక ఇబ్బంది పడుతున్న ఓ జిరాఫీకి కైరోప్రాక్టర్ డాక్టర్ చేసిన చికిత్స ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. డాక్టర్ చికిత్స ఫలితం ఇవ్వడంతో జిరాఫీ ఆనందానికి అంతేలేకుండా పోయింది.

Viral: జిరాఫీ మెడను సెట్ చేసిన డాక్టర్! ఇలాంటి చికిత్స మీరెక్కడా చూసుండరు!

ఇంటర్నెట్ డెస్క్: మెడ ఎముకలు పట్టేసి తిండి తినలేక ఇబ్బంది పడుతున్న ఓ జిరాఫీకి కైరోప్రాక్టర్ డాక్టర్ చేసిన చికిత్స ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. డాక్టర్ చికిత్స ఫలితం ఇవ్వడంతో జిరాఫీ ఆనందానికి అంతేలేకుండా పోయింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఓక్లహోమా రాష్ట్రంలోని ఓ జంతు సంరక్షణాలయంలో జెర్రీ అని జిరాఫీ ఉంది. దాని పొడవు ఏకంగా 16 అడుగులు. అయితే, ఇటీవల కాలంలో జిరాఫీ మెడ ఎముకల్లో ఇబ్బంది తలెత్తడంతో అతడి దవడలు కదిలించలేకపోయింది. తిండి తినడం కూడా తగ్గించేసింది.

Viral: తల్లిదండ్రులను కాపాడేందుకు బాలుడి సాహసం.. చికట్లో మెరుపుల వెలుగులో..


ఈ క్రమంలో జంతు సంరక్షణాలయం నిర్వాహకులు ఓ కైరోప్రాక్టర్ డాక్టర్‌ను పిలిపించారు. ఆయన జిరాఫ్‌కు చికిత్స చేసేందుకు వీలుగా కొన్ని అడుగుల ఎత్తున ఓ ర్యాంప్‌ను నిర్మించారు. ర్యాంప్‌పై ఎక్కిన డాక్టర్‌ను జీరాఫి మెడను గట్టిగా పట్టి అదిమిపెట్టడంతో అది సెట్ అయ్యింది. మెడలోని ఇబ్బందులు తొలగిపోవడంతో జిరాఫీ ఫుల్ ఖుష్ అయ్యింది (Chiropractor fixes Giraffes neck in viral Video).

కాగా, ఈ చికిత్స చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి చికిత్స మనుషులకు చేయగా విన్నాం కానీ జంతువులకు ఇలాంటి చికిత్స చేయడం ఎప్పుడూ చూడలేదని కొందరు కామెంట్ చేశారు. డాక్టర్ చికిత్సతో జిరాఫీ సమస్య తీరి అది తెగ సంబరపోయిందని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 09 , 2024 | 09:10 PM