Share News

Viral Video: నటనలో ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే.. అవాక్కవుతారు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 08:35 AM

సాధారణంగా చిరుతపులి అంటేనే వేగానికి మారుపేరు. జంతువులను వెంటాడి, వేటాడి చంపడంలో వాటికి సాటి మరో జంతువు ఉండదు. అయితే ఇలాంటి చిరుత పులులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాంటి కష్టం లేకుండా ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. తాజాగా..

Viral Video: నటనలో ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే.. అవాక్కవుతారు..

అడవిలో పులులు, సింహాల వేట కొన్నిసార్లు భయంకరంగా ఉంటే.. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు జంతువులను వేటాడే సమయంలో అవి ప్రదర్శించే తెలివితేటలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జింకను వేటాడే క్రమంలో ఓ చిరుత పులి ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చిరుతపులి అంటేనే వేగానికి మారుపేరు. జంతువులను వెంటాడి, వేటాడి చంపడంలో వాటికి సాటి మరో జంతువు ఉండదు. అయితే ఇలాంటి చిరుత పులులు కూడా కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాంటి కష్టం లేకుండా ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఆకలితో ఉన్న ఓ చిరుత వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి దూరంగా నీళ్లు తాగుతున్న ఓ జింక కనిపిస్తుంది.

Viral Video: ఆహా..! ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. ట్రాఫిక్ పోలీసులకు దొరక్కుండా ఏం చేశాడంటే..


జింకను చూడగానే వేగంగా వెళ్లి వేడాల్సిన చిరుత.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. నీళ్ల వద్దకు మెల్ల మెల్లగా నడుస్తూ వెళ్తుంది. వేటాడం మానేసి, శాఖాహారిగా మారిందేమో అన్నట్లుగా దాని ప్రవర్తన ఉంటుంది. జింకకు కాస్త దూరంగా నిలబడి నీరసంగా నీళ్లు తాగుతున్నట్లు నటిస్తుంది. దాన్ని చూసిన జింక.. చిరుత మారిపోయిందేమో అనుకుని పారిపోకుండా అక్కడే ఉంటుంది. అయితే కాసేపటి తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టి.. (leopard hunted deer) ఒక్క ఉదుటున దానిపై దాడి చేస్తుంది. చూస్తుండగానే జింకపై పంజా విసిరి మట్టికరిస్తుంది.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఇలా అతి తెలివిగా నటిస్తూ జింకను సునాయాసంగా వేటాడిన చిరుతను చూసి అక్కడున్న పర్యాటకులు షాక్ అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ చిరుత నటన మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘దీనికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 1.50 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 08:35 AM