Share News

Viral Video: రాత్రి వేళ ఇతడి జంగిల్ రైడ్ చూస్తే మతి పోవాల్సిందే.. నడవడానికే కష్టం అనుకుంటే ఇతనేమో ఏకంగా..

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:59 PM

ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలను కొందరు సులభంగా చేసేస్తుంటారు. కొన్ని విన్యాసాలు చూస్తేనే వణుకుపుట్టించేలా ఉంటాయి. అలాంటి విన్యాసాలను సైతం చాలా మంది అవలీలగా చేస్తుంటారు. ఈ తరహా...

Viral Video: రాత్రి వేళ ఇతడి జంగిల్ రైడ్ చూస్తే మతి పోవాల్సిందే.. నడవడానికే కష్టం అనుకుంటే ఇతనేమో ఏకంగా..

ఎవరికీ సాధ్యం కాని విన్యాసాలను కొందరు సులభంగా చేసేస్తుంటారు. కొన్ని విన్యాసాలు చూస్తేనే వణుకుపుట్టించేలా ఉంటాయి. అలాంటి విన్యాసాలను సైతం చాలా మంది అవలీలగా చేస్తుంటారు. ఈ తరహా వినూత్న విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ అడవిలో చేసిన సైకిల్ రైడ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నడవానికే కష్టం అనుకుంటే.. ఇతనేంటీ ఇలా చేశాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వినూత్న విన్యాసం చేశాడు. సైకిల్‌కు ముందు వైపు లైట్ ఏర్పాటు చేసి, అడవిలో రైడింగ్‪‌కు (cycle ride in the forest) వెళ్లాడు. అది మామూలు దారి అనుకుంటే పొరపాటే.. ఏకంగా రాళ్లతో నిండిపోయిన ఎగుడు దిగుడు మార్గంలో సైకిల్ తోలాడు. ఆ దారిలో నడవడం కూడా కష్టం అనుకుంటే.. ఇతనేమో ఏకంగా సైకిల్‌పై దూసుకెళ్లాడు. ఏమాత్రం అదుపుతప్పినా కొండ లోతుల్లోకి జారిపడే ప్రాంతంలో ఇతడు చేసిన సైకిల్ రైడ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది కూడా అత్యంత వేగంగా సైకిల్ తొక్కడ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

Viral Video: ఈ ఏనుగుకు బాల్యం విలువ బాగా తెలిసినట్టుంది.. చిన్న పిల్లాడికి ఎలా సాయం చేసిందో చూడండి..

అడవి మధ్యలో రాళ్లపై నుంచి ఒక్కసారిగా లోయలోకి దిగడం, అంతలోనే వంకర టింకర దారుల్లో ఏమాత్రం తడబడకుండా సైకిల్‌ని వేగంగా నడిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘వావ్! మీ టాలెంట్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Optical illusion: ఈ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించగలరా..

Updated Date - Jan 20 , 2024 | 03:59 PM