Share News

Viral Video: చలిలో ఆటో నడుపుతూ ఇతను చేసిన నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:42 AM

ప్రస్తుతం ఎక్కడ చూసిన చలి చంపేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే చలి మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక వాహనదారులైతే.. స్వెట్టర్లు, హెల్మెట్లు ధరిస్తూ చలి నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో..

Viral Video: చలిలో ఆటో నడుపుతూ ఇతను చేసిన నిర్వాకం చూస్తే.. పగలబడి నవ్వుతారు..

ప్రస్తుతం ఎక్కడ చూసిన చలి చంపేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే చలి మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక వాహనదారులైతే.. స్వెట్టర్లు, హెల్మెట్లు ధరిస్తూ చలి నుంచి బయటపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. మరికొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆటో నడుపుతూ చలి తగలకుండా ఉండేందుకు డ్రైవర్ తసీుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పూణేకు చెందిన ఓ ఆటో డ్రైవర్ (Pune Auto Driver) చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. ఉదయాన్నే ఆటో నడుపుూతున్న సమయంలో చలి నుంచి బయటపడేందుకు అందరిలా కాకుండా వినూత్న జాగ్రత్తలు తీసుకున్నాడు.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


స్వెట్టర్లు వేసుకుంటే చలిని ఆపలేవు అనుకున్నాడో ఏమో గానీ.. విచిత్రంగా ఒంటిపై మొత్తం దుప్పటి కప్పేశాడు. కళ్లు తప్ప మొత్తం కవర్ కవర్ అయ్యేలా.. ఒంటి నిండా దుప్పటి కప్పేసుకుని ఆటో నడుపుతున్నాడు. ఇలా చలి తగలకుండా వినూత్నంగా జాగ్రత్తలు తీసుకున్న ఈ ఆటో డ్రైవర్‌ను చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: నవ్వులపాలైన వరుడు.. వధువు డాన్స్ చేస్తుండగా.. సినిమా స్టైల్లో చేయాలని చూసి.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఐడియా ఏదో చాలా బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో ఇలాంటి వారికి కొదవే లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 318కి పైగా లైక్‌లు, 69వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీపై వస్తూ ఏనుగును ఢీకొన్న యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2024 | 11:42 AM