Share News

Viral Video: తన మానాన తాను బండి తోసుకుంటూ వస్తుండగా.. మధ్యలో తోపుడు బండి ఎంత పని చేసిందో చూడండి..

ABN , Publish Date - Sep 10 , 2024 | 06:36 PM

ప్రమాదాలు ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు మన తప్పేమీ లేకున్నా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఎవరి తప్పు లేకున్నా.. ప్రకృతి ఏదో ఒక రూపంలో మనపై పగ తీర్చుకుంటుంది. ఇలాంటి..

Viral Video: తన మానాన తాను బండి తోసుకుంటూ వస్తుండగా.. మధ్యలో తోపుడు బండి ఎంత పని చేసిందో చూడండి..

ప్రమాదాలు ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు మన తప్పేమీ లేకున్నా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఎవరి తప్పు లేకున్నా.. ప్రకృతి ఏదో ఒక రూపంలో మనపై పగ తీర్చుకుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలు, అనూహ్య ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన మానాన తాను రిక్షా తరహా బైకును తోసుకుంటూ వస్తుండగా.. మధ్యలో తోపుడి కారణంగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ వ్యక్తి తన రిక్షా తరహా బైకును తోసుకుంటూ వస్తుంటాడు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా రోడ్డు పక్కగా తోసుకుంటూ వస్తుంటాడు. ఇలా కొద్ది దూరం రాగానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. దారి మధ్యలో ఓ కల్వర్టు వద్దకు రాగానే.. పక్కన కాస్త దూరం నుంచి ఓ తోపుడు బండి దొర్లుకుంటూ అటుగా వస్తుంది.

Viral Video: అలలతో ఆడుకోవడం ఎప్పుడైనా చూశారా.. సముద్రంలో వీరిద్దరి నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


రోడ్డు పక్క నుంచి నేరుగా దూసుకుంటూ వచ్చిన తోపుడు బండి.. చివరకు రిక్షాను ఢీకొని అక్కడే ఉన్న కాలువలో పడిపోతుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి రిక్షా కూడా కాలువలో పడిపోతుంది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ వ్యక్తి షాక్ అవుతాడు. ‘‘నా తప్పేమీ లేకున్నా.. ఇలా జరిగిందేట్రా బాబోయ్’’.. అనుకుంటూ అలాగే చూస్తుండిపోతాడు. అయితే ఈ ఘటన చూస్తుంటే.. భారీ ఈదురుగాలుల కారణంగా తోపుడు బండి దొర్లుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..


ఇలా ఆ వ్యక్తికి తోపుడు బండి రూపంలో ప్రమాదం ముంచుకురావడం చూసి అంతా అవాక్కవుతున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ తోపుడు బండి ఎంత పని చేసింది’’.. అంటూ కొందరు, ‘‘ప్రకృతి ఇతడిపై పగబట్టినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 06:39 PM