Share News

Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..

ABN , Publish Date - Nov 27 , 2024 | 07:42 AM

కొందరు మద్యం మత్తులో చిత్రచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు కిక్కు ఎక్కువైతే ఒక్కసారిగా హీరోల్లా చెలరేగిపోతుంటారు. అందరి ముందూ బిల్డప్ ఇస్తూ కొందరు, పందేలు కాసి మరికొందరు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా..

Viral Video: కిక్కు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది.. ఏదో చేయాలని చూస్తే.. చివరికి..

కొందరు మద్యం మత్తులో చిత్రచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు కిక్కు ఎక్కువైతే ఒక్కసారిగా హీరోల్లా చెలరేగిపోతుంటారు. అందరి ముందూ బిల్డప్ ఇస్తూ కొందరు, పందేలు కాసి మరికొందరు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో స్నేహితుల ముందు హీరోలా బిల్డిప్ ఇచ్చాడు. ఫైర్ పెగ్ తాగాలని చూడగా చివరకు ఏమైందో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు స్నేహితులు (friends) పార్టీ చేసుకుంటుంటారు. చుక్క, ముక్క సిద్ధం చేసుకుని పార్టీ మొదలెడతారు. అయితే వీరిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఫైర్ పెగ్ (Fire shot peg) తాగేందుకు సిద్ధమవుతాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి అతడి పెగ్‌లో మంట వెలిగిస్తాడు. కాసేపటికి మంట ఆగిపోయినట్లు కనిపిస్తుంది. దీంతో అతను అందరి ముందూ ఫోజు కొడుతూ పెగ్ తాగేందుకు ప్రయత్నిస్తాడు.

Viral Video: వరుడు చూస్తుండగానే వధువు పక్కన స్నేహితుడి డాన్స్.. చివరకు ఆమె రియాక్షన్ చూస్తే..


అయితే పెగ్ ఇలా నోటిలో పోసుకోగానే మంటలు స్టార్ట్ అవుతాయి. అతడి ఛాతి నుంచి నోరు వరకూ సన్నని గీతలా మంట వ్యాపిస్తుంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పక్కన ఉన్న వారు కంగారు పడి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తారు. చివరకు ఎలాగోలా మంటలు ఆర్పడంతో అంతా హమ్మయ్య... అంటూ ఊపిరి పీల్చుకుంటారు. అతడికి మంటలు అంటుకోవడం చూసి కొందరు తెగ నవ్వుకుంటారు.

Viral Video: చూస్తే గానీ నమ్మడం కష్టం.. రైలు పట్టాలు దాటుతున్న బైకర్.. మధ్యలో ఊహించని విధంగా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతను మద్యం తాగుతున్నాడా.. లేక యాసిడ్ తాగుతున్నాడా’’.. అంటూ కొందరు, ‘‘మద్యం మత్తులో ఓవర్‌యాక్షన్ చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.58 లక్షలకు పైగా లైక్‌లు, 15 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా.. ప్రమాదాన్ని పట్టిగట్టగానే ఇతను చేసిన పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 27 , 2024 | 07:42 AM