Share News

Viral Video: చూస్తే గానీ నమ్మడం కష్టం.. రైలు పట్టాలు దాటుతున్న బైకర్.. మధ్యలో ఊహించని విధంగా..

ABN , Publish Date - Nov 26 , 2024 | 01:14 PM

ఓ రైల్వే గేటు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు వస్తుండడంతో గేటు క్లోజ్ చేశారు. అయినా పాదచారులు, కొందరు బైకర్లు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ బైకర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. రైలు పట్టాల దాటేందుకు ప్రయత్నిస్తుండగా..

Viral Video: చూస్తే గానీ నమ్మడం కష్టం.. రైలు పట్టాలు దాటుతున్న బైకర్.. మధ్యలో ఊహించని విధంగా..

కొన్నిసార్లు తొందరపాటు ఎన్నో అనర్థాలకు, మరెన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. పది నిముషాల కూడా వేచి చూసే ఓపిక లేక.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వాహనాల డ్రైవింగ్ సమయాల్లో చోటు చేసుకుంటుంటాయి. అందులోనూ రైల్వే ట్రాక్స్ దాటే క్రమంలో మరిన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బైకర్ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు దూసుకొచ్చింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్వే గేటు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు వస్తుండడంతో గేటు క్లోజ్ చేశారు. అయినా పాదచారులు, కొందరు బైకర్లు (biker tried to cross the train tracks) పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ బైకర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. రైలు పట్టాల దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో బైకు టైరు పట్టాల మధ్యలో ఇరుక్కుంది. దీంతో అతను బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు.

Viral Video: ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా.. ప్రమాదాన్ని పట్టిగట్టగానే ఇతను చేసిన పని చూస్తే..


అయితే అతను కిందపడిన సమయంలోనే ఓ రైలు వేగంగా అటుగా దూసుకొచ్చింది. రైలు అత్యంత సమీపానికి రావడం చూసి అతను బైకు వదిలేసి, ఒక్కసారిగా దూరంగా పారిపోయాడు. అతను పక్కకు దాటుకున్న వెంటనే రైలు వేగంగా (train hit a bike) బైకును ఢీకొని వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉన్నా అతడి ప్రాణాలు పోయేవి. అదృష్టవశాత్తు అతను ప్రమాదం నుంచి బయటపడడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: అదేమైనా మంత్రదండమా.. రోడ్డును ఎలా క్రాస్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..


రైలు వస్తున్న విషయం తెలిసి కూడా రైలు పట్టాలు దాటాలని చూసి అతన్ని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఈ అప్రమత్తత ఏదో రైలు పట్టాలు దాటక ముందు ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 3 లక్షలకు పైగా లైక్‌లు, 5.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఓరీ మీ దుంపలు తెగా.. రన్నింగ్ ఆటోలో ఈ పనులేంట్రా నాయనా.. చూశారంటే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..

Viral Video: లగేజీ బ్యాగ్‌ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 26 , 2024 | 01:14 PM