Share News

Viral Video: రాత్రి వేళ రోడ్డు పక్క పొదల్లో షాకింగ్ సీన్.. చిరుత పులి నిర్వాకం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Sep 19 , 2024 | 07:09 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రాత్రి సమయంలో వెళ్తున్న వాహనదారులకు రోడ్డు పక్కన పొదల్లో షాకింగ్ సీన్ కనిపించింది. పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనుమానం రావడంతో వాహనదారులంతా సమీపానికి వెళ్లారు. తీరా చివరకు చిరుత పులి చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కయ్యారు..

Viral Video: రాత్రి వేళ రోడ్డు పక్క పొదల్లో షాకింగ్ సీన్.. చిరుత పులి నిర్వాకం చూసి అంతా షాక్..

జనావాసాల్లోకి క్రూరమృగాలు చొరబడడం, ఉన్నట్టుండి బీభత్సం సృష్టించడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా రోడ్డుపై నడుచుంటూ వెళ్లడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ్ల పొదల్లో ఓ చిరుత పులి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని (Mumbai) ఆరే మిల్క్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో వెళ్తున్న వాహనదారులకు రోడ్డు పక్కన పొదల్లో షాకింగ్ సీన్ కనిపించింది. పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనుమానం కలగడంతో వాహనాల్లో ఉన్న వారు సమీపానికి వెళ్లి లైట్లు వేసి చూశారు.

Viral Video: ఈ చెప్పులను చోరీ చేయడం అసాధ్యమే.. ఇంతకీ ఇతను చేసిన పనేంటో చూడండి..


చివరకు ఓ చిరుతపులి పొదల్లో పడుకుని (leopard in roadside bushes) అటూ, ఇటూ మెలికలు తిరుగుతూ కనిపించింది. వాహనం రావడం చూసి పులి ఏమాత్రం చలించలేదు. ‘‘నన్ను కాసేపు ప్రశాంతంగా కూడా ఉండనివ్వరా’’.. అని అన్నట్లుగా వాహనం వైపు చూసి, మళ్లీ అలాగే పడుకుని మెలికలు తిరుగుతూ కనిపించింది. చాలా మంది వాహనదారులు ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. కొందరు తమ వాహనాలను అక్కడే ఆపుకొని పులిని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


మరికొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పులి చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అడవులను నరికేయడం వల్లే ఇలా జరుగుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 07:09 PM