Share News

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:46 PM

వాహనాల్లో వింత వింత వస్తువులను విచిత్ర పద్ధతుల్లో తరలించే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు బస్సుల్లో వెళ్తూ వెంట చిలుకలు తీసుకెళ్లడం చూశాం. అలాగే మరికొందరు తమ పెంపుడు జంతువులతో బస్సులు, రైళ్లలో వెళ్లడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ..

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..

వాహనాల్లో వింత వింత వస్తువులను విచిత్ర పద్ధతుల్లో తరలించే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు బస్సుల్లో వెళ్తూ వెంట చిలుకలు తీసుకెళ్లడం చూశాం. అలాగే మరికొందరు తమ పెంపుడు జంతువులతో బస్సులు, రైళ్లలో వెళ్లడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి బైకులో తీసుకెళ్లిన లగేజీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై ఎత్తైన లగేజీని తీసుకెళ్తుండడం చూసి మొదట ఎలాంటి అనుమానం రాలేదు. అయితే తీరా సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి తన స్కూటీపై ఎత్తైన లగేజీ పెట్టుకుని వెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నా. అతను తీసుకెళ్తున్న లగేజీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ముందుగా అతడిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే కొందరు కారులో వెళ్తూ ఆ లగేజీని చూడగా.. ఏదో తేడాగా అనిపించింది. దీంతో చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్ కనిపించింది.

Viral Video: భార్యాభర్తలు వంట గదిలో ఉండగా సడన్‌ షాక్.. కళ్లు మూసి తెరిచే లోపే..


స్కూటీ వెనుక వైపు ఉన్న లగేజీ మొత్తం కరెన్సీ నోట్లే ఉన్నాయి. రూ.500, రూ.1000ల నోట్ల కట్టలను (man carrying bundles of currency notes on scooty) అతను ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాడని వీడియో తీసిన వారు చెబుతున్నారు. కారులో ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


అయితే కొందరు అవి కరెన్సీ నోట్ల కట్టలు కావు.. పేపర్ ముక్కలు అంటుండగా.. మరికొందరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అవి కరెన్సీ నోట్ల కట్టలు కావు.. కేక్ బాక్సులు’’.. అంటూ కొందరు, ‘‘అంత డబ్బులు అలా తీసుకెళ్లడం సాధ్యం కాదు.. కాబట్టి అవి కరెన్సీ నోట్లు కావని తెలుస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.44 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 07:46 PM