Share News

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 15 , 2024 | 06:47 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మహిళల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. బస్సులు, రైళ్లలో డాన్సులు వేసే మహిళలతో పాటూ ఇళ్లల్లో చిత్ర చిత్రమైన పనులు చేసే మహిళను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా...

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మహిళల విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. బస్సులు, రైళ్లలో డాన్సులు వేసే మహిళలతో పాటూ ఇళ్లల్లో చిత్ర చిత్రమైన పనులు చేసే మహిళను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. పాత్రలు కడుగుతున్న ఓ మహిళను చూసి కొందరికి అనుమానం కలిగింది. చివరకు దగ్గరికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మొరెనా జిల్లాలోని మహువా పోలీస్ స్టేషన్ పరిధి గణేష్‌పురా గ్రామంలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. ఈమెను చూసిన కొందరికి అనుమానం కలిగింది. ఏం చేస్తుందబ్బా.. అనుకుంటూ సమీపానికి వెళ్లి చూడగా.. ఆమె పాత్రలకు బదులుగా (Woman cleaning old pistols) పాత తుపాకీలను శుభ్రం చేస్తూ కనిపించింది.

Viral Video: వామ్మో.. బతికుండగానే గోతిలో పూడ్చేశారు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మొత్తం నాలుగు కంట్రీమేడ్ పిస్టళ్లను ఎదురుగా పెట్టుకుంది. వాటిని పెద్ద పాత్రలోని నీటిలో వేసి బ్రష్‌తో శుభ్రం చేసింది. ఇలా పాత తుపాకులన్నింటినీ సబ్బుతో శుభ్రం చేసి, తళతళా మెరిసేలా చేసింది. ఈ ప్రాంతంలో తరచూ దోపిడీలు జరుగుతుంటాయి. దోపిడీ దొంగల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం స్థానికుల్లో చాలా మంది ఇళ్లల్లో దొంగచాటుగా తుపాకులను దాచుకుంటారని తెలిసింది.

Viral Video: ఈ కప్ప టాలెంట్ మామూలుగా లేదుగా.. పాము వద్దకు వెళ్లి అది చేసిన నిర్వాకం చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వెంటనే సంఘటన స్థలాన్ని గుర్తించారు. స్థానికంగా పిస్టళ్లను తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు మహిళ తుపాకులను శుభ్రం చేసే వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఏవమ్మా.. అవేమన్నా దీపావళి పిస్టళ్లు అనుకున్నావా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Updated Date - Aug 15 , 2024 | 06:47 PM