Share News

Viral Video: బుసలు కొడుతున్న పామును.. గజాగజా వణికించిన తేలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Oct 10 , 2024 | 09:06 PM

ఆకలితో ఉన్న పాము వేటాడే క్రమంలో ఓ రాళ్ల గూడులోకి వెళ్తుంది. అందులో ఏమైనా గుడ్లు ఉంటే తినేద్దామని చూస్తుంది. అయితే ఆ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గుడ్లకు బదులుగా దానికి రెండు తేళ్లు కనిపిస్తాయి. వాటిని చూడగానే..

Viral Video: బుసలు కొడుతున్న పామును.. గజాగజా వణికించిన తేలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..

పాము పగడ విప్పి బుసలు కొడితే.. ఎదురుగా ఎలాంటి జంతువున్నా భయంతో పారిపోవాల్సిందే. ఆఖరికి అన్ని జంతువులనూ వేటాడి చంపే పులి కూడా పాము దెబ్బకు వణికిపోతుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి పాములకూ విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అది కూడా చిన్న చిన్న జీవుల విషయంలో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పడగ విప్పి బుసలుకొడుతున్న పామును ఓ తేలు భయంతో వణికేలా చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న పాము వేటాడే క్రమంలో ఓ రాళ్ల గూడులోకి వెళ్తుంది. అందులో ఏమైనా గుడ్లు ఉంటే తినేద్దామని చూస్తుంది. అయితే ఆ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. గుడ్లకు బదులుగా దానికి రెండు తేళ్లు కనిపిస్తాయి. వాటిని చూడగానే భయంతో గోడ చాటుకు వెళ్లి బుసలు కొడుతుంది.

Viral Video: బైకును ఇలా వాడడం ఎక్కడైనా చూశారా.. కుట్టు మిషన్‌ మోటారుగా చేసి మరీ..


ఓ తేలు గోడపై ఉండగా.. మరో తేలు (scorpion scared the cobra) పాము సమీపానికి వెళ్లి భయపెడుతుంది. దగ్గరికి వెళ్లి ‘‘రా తేల్చుకుందాం.. నువ్వా.. నేనా’’.. అన్నట్లుగా ముందుకు, వెనక్కు జరుగుతూ పాముకు సవాల్ విసురుతుంది. అయితే తేలు దగ్గరికి రావడాన్ని చూసిన పాము.. భయంతో మరింత వణుకుతూ గోడకు అతుక్కుపోతుంది. ‘‘నన్నేం చేయొద్దు.. నీతో పోటీకి దిగడం నా వల్ల కాదు.. వదిలెయ్’’.. అన్నట్లుగా వణికిపోతుంటుంది. ఇలా ఆ తేలు చాలా సేపు అక్కడే ఉండి పాముకు చుక్కలు చూపిస్తుంది.

Viral Video: ఫోన్‌లో లీనమైన వ్యక్తి.. పక్కనే బుసలు కొడుతున్న కోబ్రా.. చివరకు ఏమైందో చూస్తే..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నాగు పాముకు చుక్కలు చూపించిన తేలు’’.. అంటూ కొందరు, ‘‘ఈ తేలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.54 లక్షలకు పైగా లైక్‌లు, 11 మిలియన్లకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెగ్గు వేయగానే బయటపడ్డ టాలెంట్.. ఏకంగా బ్రూస్‌లీనే మించిపోయాడుగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 10 , 2024 | 09:06 PM