Share News

Viral Video: రోజూ హెల్మెట్ వాడుతుంటారా.. ఈ వీడియో చూశారంటే.. ఖంగుతింటారు..

ABN , Publish Date - Jan 28 , 2024 | 09:19 PM

కాలం కలిసిరాకపోతే తాడే పాము అయిన చందంగా.. కొన్నిసార్లు మనం ఊహించని ప్రదేశాలు, వస్తువుల్లో కలలో కూడా ఊహించని జీవులు ప్రత్యక్షమవుతుంటాయి. రోజూ వారీ చేసే పనులే అయినా...

Viral Video: రోజూ హెల్మెట్ వాడుతుంటారా.. ఈ వీడియో చూశారంటే.. ఖంగుతింటారు..

కాలం కలిసిరాకపోతే తాడే పాము అయిన చందంగా.. కొన్నిసార్లు మనం ఊహించని ప్రదేశాలు, వస్తువుల్లో కలలో కూడా ఊహించని జీవులు ప్రత్యక్షమవుతుంటాయి. రోజూ వారీ చేసే పనులే అయినా చేస్తున్న ప్రతిసారీ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కొన్నిసార్లు మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకునే సమయంలో అనుమానం వచ్చి లోపల పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించలేదు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై వెళ్లే ముందు ఇంట్లోకి వెళ్లి హెల్మెట్ తీసుకున్నాడు. అయితే తీరా తలకు పెట్టుకునే సమయంలో లోపల ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చింది. దీంతో పరిశీలించగా ఓ పాము బుసలు (snake hiding in helmet) కొడుతూ కనిపించింది. దీంతో భయంతో హెల్మెట్‌ని విసిరి పక్కన పడేశాడు. చివరకు స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నాడు.

Viral: ఇంటికి వెళ్తూ తమలపాకులు తినాలన్న కోరిక.. అతడి నేరాలన్నింటినీ బయట పెట్టింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హెల్మట్ లోపల ఏమాత్రం అనుమానం రాకుండా పాము దాక్కోవడం చూసి అంతా అవాక్కయ్యారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని.. ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇకపై హెల్మెట్ పెట్టుకోవాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాముకు ఎక్కడా స్థలం లేనట్లు ఇక్కడ దూరిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ 4 పురాతన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే.. కళ్లద్దాలతో పని లేనట్లే..

Updated Date - Jan 28 , 2024 | 09:53 PM