Share News

Viral: పేషెంట్‌ను పరీక్షించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న డాక్టర్.. వెనక్కు తిరిగి చూసేలోపే.. షాక్ ఇచ్చిన రోగి..

ABN , Publish Date - Jan 27 , 2024 | 08:01 PM

వైద్యులు దేవుళ్లతో సమానంగా చూస్తాం కాబట్టే.. వైద్యో నారాయణ హరి.. అని అంటూ ఉంటాం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది వైద్యులు అనేక రకాల దాడులకు గురవుతున్నారు. కొందరు..

Viral: పేషెంట్‌ను పరీక్షించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న డాక్టర్.. వెనక్కు తిరిగి చూసేలోపే.. షాక్ ఇచ్చిన రోగి..
ప్రతీకాత్మక చిత్రం

వైద్యులు దేవుళ్లతో సమానంగా చూస్తాం కాబట్టే.. వైద్యో నారాయణ హరి.. అని అంటూ ఉంటాం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది వైద్యులు అనేక రకాల దాడులకు గురవుతున్నారు. కొందరు రోగులు కావాలనే కక్ష పెట్టుకుని మరీ దాడులు చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, హర్యానాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వైద్యుడు పేషెంట్‌ను పరీక్షించిన అనంతరం శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. అయితే అంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) గురుగ్రామ్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెక్టార్-82A ప్రాంతంలో పీయూష్ యాదవ్ అనే వ్యక్తి క్లినిక్ (Clinic) నడుపుతున్నాడు. ఇదిలావుండగా, మంగళవారం సదరు క్లినిక్‌కు అందిరితో పాటే ఓ రోగి వచ్చాడు. అతన్ని విచారించిన డాక్టర్ తర్వాత వివిధ రకాల పరీక్షలు చేశాడు. పరీక్షించిన అనంతరం యథావిధిగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఇలా చేతులు శుభ్రం చేసుకుని, అలా వెనక్కు తిరిగాడో లేదో.. అంతలోనే సదరు రోగి వైద్యుడిపై (Patient assaults on doctor) దాడికి పాల్పడ్డాడు. రోగి వెంట వచ్చిన వ్యక్తి కూడా వైద్యుడిపై దాడికి దిగాడు. ఇద్దరూ కలిసి అడ్డు వచ్చిన అటెండర్‌ను కూడా చితకబాదారు.

Viral Video: పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన చిరుతపులి.. భయంతో పారిపోయిన పోలీసులు.. అయితే..

ఈ దాడిపై వైద్యుడు బుధవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. క్లినిక్ ఉన్న భవనం రెండో అంతస్థుపై జిమ్ సెంటర్ ఉందని వైద్యుడు తెలిపాడు. అందులో రోజూ మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టడంతో పాటూ గోల చేస్తుండడంతో గతంలో కాంప్లెక్స్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశానని చెప్పాడు. అప్పటి నుంచి తనపై జిమ్ సెంటర్ యజమాని కక్ష పెంచుకున్నారని, ఇప్పుడు కావాలనే అతడి మనుషులను పంపి దాడి చేయించాడని ఆరోపించాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: మరో యువకుడితో భార్య ప్రేమాయణం.. సడన్‌గా రోడ్డుపై భర్త కంటపడిన ప్రియుడు.. చివరకు..

Updated Date - Jan 27 , 2024 | 08:34 PM