Share News

Viral Video: యాంటెన్నా పైనుంచి వేలాడుతూ కాకిని పట్టుకున్న పాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:38 PM

ఓ పాము వేటాడే పద్ధతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నేలపై వేటాడాల్సిన పాములు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఓ పాము ఇలాగే చేసింది. ఆకలితో ఉన్న పాము చివరకు ఓ యాంటెన్నా పైకి ఎక్కింది. వేట కోసం అటూ, ఇటూ చూస్తూ..

Viral Video: యాంటెన్నా పైనుంచి వేలాడుతూ కాకిని పట్టుకున్న పాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

పాములు, కొండచిలువల దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఒక్కసారి వాటి బారిన పడ్డాయంటే ఇక దాదాపు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. వివిధ రకాల జీవులపై దాడి చేసి చంపేసే పాములను తరచూ చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పాము యాంటెన్నాపై వేలాడుతూ ఓ కాకిని పట్టుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము వేటాడే పద్ధతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నేలపై వేటాడాల్సిన పాములు కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఓ పాము ఇలాగే చేసింది. ఆకలితో ఉన్న పాము చివరకు ఓ యాంటెన్నా పైకి ఎక్కింది. వేట కోసం అటూ, ఇటూ చూస్తూ ఎదురు చూస్తుండగా చివరకు దానికి ఓ కాకి కనిపించింది.

Viral Video: ఈ పాముకు అత్యాశ ఎక్కువనుకుంటా.. గుడ్డును తినబోయి చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..


ఇంకేముందీ యాంటెన్నా పైనుంచే ఎంతో చాకచక్యంగా కాకిపై దాడి చేసింది. కాకిని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత దాని తలను పట్టుకుని పైకి లాగింది. ముందుగా తలను పట్టుకుని పైకి లాగిన పాము.. ఆ తర్వాత కాకిని చుట్టేసి చటుకున్న పైకి లాగేసింది. ఇలా యాంటెన్నా పైనుంచే కాకిని ఎంతో వేటాడిన పామును చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Viral Video: కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పాము వేట చూస్తుంటే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో పాపం.. కాకిని చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 05:44 PM