Share News

Viral Video: కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:25 PM

సోషల్ మీడియాలో కోహ్లీ, అనుష్క దంపతులు క్రికెట్ ఆడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడుతున్న అనుష్క.. అతడికి కొత్త రూల్స్ పెట్టింది. క్రికెట్‌లో ఆరితేరిన కోహ్లీ.. చివరకు భార్య చదివి వినిపించిన వింత రూల్స్ విని ఖంగు తినాల్సి వచ్చింది..

Viral Video: కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క.. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..

భారత క్రికెట్‌ చరిత్రలో సచిన్, ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన వారిలో కోహ్లీ చిరస్థాయిగా నిలిచిపోతానడంలో ఎలాంటి సందేహం లేదు. క్రీజులో ఫోర్లు, సిక్సర్లు కొట్టి క్రికెట్ అభిమానులను అలరించడమే కాకుండా భారత జట్టుకు అనేక విజయాలు అందడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే కోహ్లీ భార్య అనుష్కకు కూడా నటిగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ దంపతులు ఇద్దరూ ఎక్కడ కనిపించినా ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వీరిద్దరూ కలిసి క్రికెట్ ఆడిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో కోహ్లీకి అనుష్క రూల్స్ నేర్పించింది. ఆమె పెట్టిన రూల్స్ విని కోహ్లీ షాక్ అయ్యాడు. చివరకు అతడి పరిస్థితి ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో కోహ్లీ, అనుష్క దంపతులు క్రికెట్ ఆడుతున్న వీడియో (Virat Kohli, Anushka viral video) తెగ వైరల్ అవుతోంది. కోహ్లీతో కలిసి క్రికెట్ ఆడుతున్న అనుష్క.. అతడికి కొత్త రూల్స్ పెట్టింది. క్రికెట్‌లో (Cricket) ఆరితేరిన కోహ్లీ.. చివరకు భార్య చదివి వినిపించిన వింత రూల్స్ విని ఖంగు తినాల్సి వచ్చింది. ఎవరి చేతిలో బ్యాట్ ఉంటే.. వారే ముందు బ్యాటింగ్ చేయాలని చెప్పింది. దీంతో చేసేదిలేక అనుష్కకు కోహ్లీ బౌలింగ్ చేశాడు.

Viral Video: కింగ్‌ఫిషర్ పవర్ ఎలా ఉంటుదో ఎప్పుడైనా చూశారా.. నీటిలోకి బుల్లెట్‌లా దూసుకెళ్లి.. చూస్తుండగానే..


అయితే కోహ్లీ వేసిన మొదటి బంతికే అనుష్క ఔట్ అయింది. కానీ మొదటి బంతి ట్రైల్ అంటూ మెలిక పెట్టింది. దీంతో అవాక్కైన కోహ్లీ.. రెండో బంతికి మళ్లీ ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కోహ్లీకి అనుష్క బంతిని విసిరింది. అయితే మొదటి బంతినే కోహ్లీ భారీ షాట్ కొట్టడంతో దూరంగా పడిపోయింది. అయితే ఇక్కడ మళ్లీ అనుష్క మరో మెలిక పెట్టింది. ‘‘బంతిని ఎవరు దూరంగా కొడితే.. వాళ్లే వెళ్లి తీసుకురావాలి’’.. అంటూ కండీషన్ పెట్టింది. దీంతో మళ్లీ ఖంగుతిన్న కోహ్లీ విధి లేని పరిస్థితిలో దూరంగా పడిపోయిన బంతిని తీసుకురావాల్సి వచ్చింది.

Viral Video: ఇంట్లోకి చొరబడుతున్న దొంగలు.. మహిళ తెలివిగా చేసిన పనితో.. చివరకు..


ఇలా క్రికెట్ ఆడే సమయంలో ఈ దంపతుల మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. కోహ్లీ, అనుష్క క్రికెట్ మ్యాచ్.. మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లు, 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2024 | 03:25 PM