Share News

Watch Video: ఈ టాటూ ఆర్టిస్ట్ ఒక్క క్షణం ఆలస్యం చేసినా.. ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో చూడండి..

ABN , Publish Date - Feb 14 , 2024 | 09:24 PM

కొన్నిసార్లు చిన్న చిన్న పనులతో పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా ఆగిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు కొందరి తక్షణ స్పందన.. ఇంకొందరి ..

Watch Video: ఈ టాటూ ఆర్టిస్ట్ ఒక్క క్షణం ఆలస్యం చేసినా.. ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో చూడండి..

కొన్నిసార్లు చిన్న చిన్న పనులతో పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా ఆగిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు కొందరి తక్షణ స్పందన.. ఇంకొందరి ప్రాణాలనే కాపాడుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ టాటూ ఆర్టిస్ట్ తక్షణమే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ టాటూ ఆర్టిస్ట్ (Tattoo artist) తన వద్దకు వచ్చిన యువకుడి చేతిపై టాటూ వేస్తుంటాడు. అతడి అభిరుచికి తగ్గట్టుగా చేతిపై మంచి టాటూను వేస్తాడు. టాటూ వేసిన తర్వాత పరికరాన్ని లోపల పెట్టేందుకు వెళ్తాడు. అతను గదిలోకి వెళ్లేందుకు ఇలా డోరు తీయగానే.. టాటూ వేయించుకున్న యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడబోతాడు. అయితే ఆ యువకుడు కింద పడిపోవడాన్ని గమనించిన టాటూ ఆర్టిస్ట్.. (tattoo artist saved the man) వెంటనే వెనక్కు తిరిగి అతన్ని పట్టుకుంటాడు.

Viral Video: మానవాళికి కనువిప్పు కలిగించిన పులి.. ఇంతకీ అది చేసిన పనేంటో మీరే చూడండి..

దాదాపు నేలపై పడిపోయే సమయంలో అతను స్పందించి, చేతులను అడ్డుగా పెట్టి కిందపడిపోకుండా పట్టుకుంటాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత అక్కడే ఉన్న వారు పరుగెత్తుకుంటూ వస్తారు. అంతా కలిసి అతన్ని ఎత్తుకుని పక్కకు తీసుకెళ్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టాటూ ఆర్టిస్ట్ తక్షణ స్పందన అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘క్షణాల్లో స్పందించి.. యువకుడిని కాపాడటం అభినందనీయం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Photo Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 5 తేడాలు ఉన్నాయి. అవేంటో 60 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..

Updated Date - Feb 14 , 2024 | 09:25 PM